Mocha Cyclone Alert 2023: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. ఇప్పుడిది పెను తుపానుగా బలపడి ఈశాన్య రాష్ట్రాలవైపుకు దూసుకెళ్తోంది. ఫలితంగా అతి భారీ వర్షాలు తప్పవనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
మే 6 తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయగుండమై తరువాత తీవ్ర వాయగుండంగా పరిణమించింది. అనంతరం మోచా తుపానుగా మారి ఉత్తర వాయువ్య దిశగా పెను తుపానుగా దూసుకొస్తోంది. వాస్తవానికి తొలుతు మోచా తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని భావించారు. అయితే తుపానుగా మారిన తరువాత దిశ మార్చుకోవడంతో ఏపీ, ఒడిశాలకు ముప్పు తప్పింది. ఇప్పుడీ పెను తుపాను ఈశాన్య రాష్ట్రాలవైపుకు దూసుకొస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు పడనుండటంతో రెడ్ అలర్ట్ జారీ అయింది.
తీరం ఎక్కడ దాటనుంది
పెను తుపానుగా మారిన మోచా తుపాను బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లో ఈనెల 14వవ తేదీన తీరం దాటనుంది. ఫలితంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం దాటే సమయంలో 150-175 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ఈదురు గాలులు వీయవచ్చని అంచనా. ఈ క్రమంలో త్రిపుర, మిజోరాం, మణిపూర్, దక్షిణ అస్సోం, నాగాలాండ్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలుల కారణంగా నష్టం ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. భారీ వర్షాల నేపధ్యంలో రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ నెల 14న తీరం దాటిన తరువాత క్రమంగా బలహీనపడుతూ తిరిగి ఈశాన్య రాష్ట్రాలవైపుకు రానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
మోచా తుపాను నేపధ్యంలో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు 120 నుంచి 175 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీయవచ్చు. అదే సమయంలో కేరళ, తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. మోచా తీవ్ర తుపాను కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Supreme Court on Maharashtra: థాక్రే రాజీనామా చేయకుంటే ప్రభుత్వం పునరుద్ధరించేవాళ్లం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook