Bottle Gourd Side Effects: సొరకాయ శరీరానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో విటమిన్ సి, లిపిడ్లు, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వేసవి కాలంలో దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు మార్కెట్లో తాజాగా లేని సొరకాయను తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా సొరకాలను ఎలా గుర్తించాలో తెలుసా?:
సొరకాలను చూడటానికి తాజాగా ఉంటాయి:
ప్రస్తుతం మార్కెట్లో చూడడానికి సొరకాలు తాజాగా ఉన్నప్పటికీ.. బయటకు లేతగా ఆకుపచ్చ రంగులో ఉన్న గంట తర్వాత తెల్లగా మారుతుంది. ఇలాంటి సొరకాయ ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి రంగు కలిగిన సొరకాయలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
సొరకాల తొక్కతో కూడా నిర్ధారించవచ్చు:
మార్కెట్లో లభించే సొరకాలు ఎక్కువగా ముదిరిపోయినవి లభిస్తున్నాయి. అయితే వీటిని కూరల్లో వినియోగించడం వల్ల పొట్టలో నొప్పి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి లేత సొరకాయలా కావా అని తెలుసుకుని కూరలోకి వినియోగించాల్సి ఉంటుంది.
చిన్న పరిమాణంలో ఉండే సొరకాలను తీసుకోవాలి:
ప్రస్తుతం చాలా మంది పెద్ద సైజ్‌లో ఉన్న సొరకాలను తీసుకుంటున్నారు. వీటిని తీసుకుని వినియోగించడం వల్ల పొట్ట సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చిన్న పరిమాణంలో ఉండే సొరకాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వేలిగోరుతో సొరకాయను గిచ్చి చూడడం వల్ల ముదిరిపోయిందా? లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.