How To Make Peppermint Face Mask: పుదీనా శరీరానికి తాజాదనాన్ని ఇచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది వేసవిలో రిఫ్రెష్ అవ్వడానికి పుదీనాతో కూడిన డ్రింక్స్ ప్రతి రోజు తీసుకుంటారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సంరక్షణకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీవ్ర చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. పుదీనా వేసవిలో చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ అందిస్తుంది. కాబట్టి ఎండ కారణంగా చర్మం ఎర్రబడకుండా, దురద వంటి సమస్యల రాకుండా పుదీనా ఫేస్ మాస్క్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఫేస్ మాన్క్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పుదీనా ఫేస్ మాస్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల పెరుగు
10 నుంచి 12 పుదీనా ఆకులు
ఫేస్ మాస్క్ తయారి పద్ధతి:
పుదీనా ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా చెట్టు నుంచి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.
వాటిని బాగా కడిగి గ్రైండర్‌లో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో 2 స్పూన్ల పెరుగు వేసుకోవాల్సి ఉంటుంది.
అంతే సులభంగా ఫేస్ మాస్క్ సిద్ధంగా ఉన్నట్లే..
ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలో తెలుసా?:
ఈ ఫేస్ మాస్క్‌ను అప్లై చేసుకోవడానికి ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ని ముఖానికి అప్లై చేయాలి.
అప్లై చేసి 20 నిమిషాల దాకా అలాగే ఉంచాల్సి ఉంటుంది.
ఇలా అప్లై చేసి ఫేస్ మాస్క్ ఆరిపోయాక నీటిని వేసి మసాజ్ చేయాలి.
ఇలా మసాజ్ చేసిన తర్వాత నీటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
శుభ్రం చేసిన తర్వాత కటన్ గుడ్డతో తూడ్చుకోవాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.