Cyclone Mocha News: ఏపీకి మరో గండం.. ముంచుకొస్తున్న 'మోచా' తుపాను ముప్పు

Cyclone Mocha News: భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ కూడా తూర్పు తీర రాష్ట్రమే కావడంతో రైతులను, తీర ప్రాంత వాసులను మోచా తుపాన్ ముప్పు భయం పట్టుకుంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఈ తుపాన్ రాకతో ఇంకేం జరగనుందో అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2023, 05:02 AM IST
Cyclone Mocha News: ఏపీకి మరో గండం.. ముంచుకొస్తున్న 'మోచా' తుపాను ముప్పు

Cyclone Mocha News: ఇప్పటికే గత రెండు వారాలకు పైగా కురుస్తున్న అకాల వర్షాలతో జరిగిన పంట నష్టానికి విలవిల్లాడిపోతున్న రైతన్నలకు తుపాన్ రూపంలో మరో గండం చుట్టుముట్టనుంది. భారత వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం వచ్చే వారం తూర్పు తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలకు తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం అల్పపీడనంగా మారి అది తుపానుగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో మత్య్సకారులు సముద్రంలోకి చేపట్ల వేటకు వెళ్లకూడదని జాలర్లను హెచ్చరించింది. 

భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ''మే 6 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఆ మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఆ తరువాత అది తీవ్ర అల్పపీడనంగా మారి, ఆ తరువాత రెండు రోజుల్లోగా.. అంటే మే 9 నాటికి తీవ్ర అల్పపీడనం తుపానుగా బలపడే అవకాశముంది " అని తెలిపారు. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ.. మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహపాత్ర స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, మరో 4-5 రోజులు ఏపీలో భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ కూడా తూర్పు తీర రాష్ట్రమే కావడంతో రైతులను, తీర ప్రాంత వాసులను మోచా తుపాన్ ముప్పు భయం పట్టుకుంది. ఇప్పటికే అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఈ తుపాన్ రాకతో ఇంకేం జరగనుందో అని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. వాయుగుండం, అల్పపీడనంగా మారిన వెంటనే ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేసేలా నివేదికలు అందిస్తామని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తుపాన్ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ సర్కారు.. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందిగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

ఇది కూడా చదవండి : Wife Killed Husband: ప్రియుడితో అక్రమ సంబంధం.. తెలివిగా భర్త మర్డర్.. కూతురికి సహకరించిన తండ్రి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News