Shani Gochar in Satabhisha Nakshatra 2023: ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత రాశిచక్రం మరియు నక్షత్రరాశులను మారుస్తుంది. ఇలాంటి గ్రహాల్లో శని కూడాఒకటి. శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇతడు మార్చి 15న శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ రాశికి అధిపతిగా రాహువును భావిస్తారు. శని అక్టోబరు 17 వరకు అదే నక్షత్రంలో ఉంటాడు. శతభిష నక్షత్రంలో శని సంచారం కారణంగా రాబోయే ఆరు నెలలపాటు ఈ రాశుల జీవితం అల్లకల్లోలంగా మారనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి శని రాశి మార్పు మంచిది కాదు. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఆఫీసులో శత్రువులకు దూరంగా ఉండండి, లేకుంటే వారి వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు. మీరు ఏదైనా డీల్ పై సంతకం చేసేటప్పుడు చూసుకోని పెట్టండి.
వృశ్చిక రాశి
శని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి హాని కలిగిస్తుంది. మీరు డబ్బు మరియు ఆస్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోంటారు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం అస్సలు కలిసిరాదు.
Also Read: Mangal Gochar 2023: మే 10న కీలక పరిణామం.. ఈ 6 రాశులపై 45రోజులపాటు డబ్బు వర్షం..
మీనరాశి
శతభిషా నక్షత్రంలో శని సంచారం మీన రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం సడే సతి ఈ రాశిపై నడుస్తోంది. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పనిలో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: Shani Retrograde 2023: కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్న శని.. ఈ రాశులకు మనీ మనీ మోర్ మనీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook