Income Tax Benefits: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఇలా ట్యాక్స్‌ బెనిఫిట్ పొందండి

Income Tax Saving Tips 2023: పన్ను చెల్లింపుదారులకు ఎప్పుడు ఓ కన్ఫ్యూజన్ ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయాలా..? పాత పన్ను విధానం ఎంచుకోవాలా..? అని ఆలోచిస్తుంటారు. మీరు వివిధ పథకాల్లో పెట్టబడి పెడుతుంటే.. పాత పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 23, 2023, 02:10 PM IST
Income Tax Benefits: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. ఇలా ట్యాక్స్‌ బెనిఫిట్ పొందండి

Income Tax Saving Tips 2023: పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఏడు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి రూ.33,800 ట్యాక్స్ సేవ్ అయింది. పాత పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటితే.. ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే.. మీకు ఆరు విధాలుగా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. 
 
కొత్త పన్ను విధానంలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ.. ఈ విధానంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెద్దగా బెనిఫిట్స్ ఉండవు. కానీ.. స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం కచ్చితంగా యాడ్ అవుతుంది. మీరు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టుంటే.. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం మీరు పాత పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమం. పాత పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే.. మీకు అనేక మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

==> జీతం పొందే వ్యక్తులకు 50 వేల రూపాయలు స్టాండర్డ్ డిటెక్షన్ పొందుతారు.

==> సెక్షన్ 80 సీసీడీ (1బీ): ఎస్‌పీఎస్ అకౌంట్‌లో డిపాజిట్లకు రూ.50 వేల వరకు అదనపు మినహాయింపు ఉంటుంది.

==> సెక్షన్ 80 టీటీఏ: కో ఆపరేటివ్ సొసైటీ లేదా పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్‌ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై అత్యధికంగా రూ.10 వేల తగ్గింపును పొందొచ్చు.

==> సెక్షన్ 80 డీ: హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంపై బెనిఫిట్ పొందొచ్చు.

==> సెక్షన్ 80 జీ: అర్హత ఉన్న ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలకు చేసిన విరాళాలు ఇచ్చి.. ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు.

==> సెక్షన్ 80 సీ: ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్‌ఎస్ఎస్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్, ఎస్ఎస్‌వై, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌సీఎస్‌ఎస్‌లలో ఇన్వెస్ట్ చేస్తే.. ట్యాక్స్ నుంచి మినహాయింపును పొందొచ్చు. 

Also Read: Bandi Sanjay Comments: సీఎం కాలేననే బాధతోనే రేవంత్ కన్నీళ్లు.. ఈటల ఆ మాట అనలేదు: బండి సంజయ్  

Also Read: Arshdeep Singh Bowling: ఇదేక్కడి బౌలింగ్ సింగ్ మావా.. రెండుసార్లు స్టంప్‌లు విరగొట్టిన అర్ష్‌దీప్.. వాటి ధర ఎంతో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News