Coffee Powder For White Hair To Black Hair: కప్పు కాఫీ మైండ్‌ను రిఫ్రేష్, ఎనర్జిటిక్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాఫీ మైండ్‌ను రిఫ్రేష్ చేయడమేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు లభిస్తాయి. కాబట్టి జుట్టును మృదువుగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాఫీని జుట్టుకు ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీలో ఉండే గుణాలు జుట్టును క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు మూలాల నుంచి దృఢంగా, ఒత్తుగా చేసేందుకు కృషి చేస్తుంది. కాబట్టి జుట్టుకు ఈ పద్ధతిలో కాఫీని అప్లై చేయాల్సి ఉంటుంది.
ముందుగా కాఫీ పొడిని ఒక గిన్నెలో తీసుకోవాల్సి ఉంటుంది. అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల కలబంద రసం వేసి మిశ్రమంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచాల్సి ఉంటుంది. తర్వాత తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
కాఫీ, ఆలివ్ ఆయిల్:
ఒక గిన్నెలో 1 టీస్పూన్ కాఫీ పౌడర్ తీసుకుని.. 2 టేబుల్ స్పూన్ల కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ రెండిటినీ బాగా మిక్స్ చేసి జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసి 40 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్గానిక్ షాంపూతో శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.
కాఫీ, పెరుగు హెయిర్ మాస్క్:
మృదువైన, ఒత్తు గల జుట్టును పొందడానికి తప్పకుండా కాఫీ, పెరుగు హెయిర్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం ఒక కప్పు తీసుకుని అందులో కాఫీ, పెరుగును వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న మాస్క్‌ను జుట్టుకు అప్లై చేసి వారానికి 2 నుంచి 3 సార్లు జుట్టుకు అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తెల్ల జుట్టు కూడా సులభంగా నల్లగా మారుతుంది.
కాఫీ, తేనె మిశ్రమం:
ఒక చెంచా కాఫీ పొడిని గిన్నెలో తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండింటి కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు క్రమం తప్పకుండా అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలు దూరమవుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
White Hair To Black Hair: రెండు వారాల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!, నమ్మట్లేదా?