ATM Withdrawal Rules: ఈ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. నగదు విత్‌డ్రాలో రూల్స్ మార్పు

PNB New Rules For ATM Cash Withdrawal 2023: ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా రూల్స్‌ను మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక నుంచి మీ అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. బ్యాంక్ జరిమానా వసూలు చేయనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 21, 2023, 11:54 AM IST
ATM Withdrawal Rules: ఈ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. నగదు విత్‌డ్రాలో రూల్స్ మార్పు

PNB New Rules For ATM Cash Withdrawal 2023: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఇక నుంచి అకౌంట్‌లో సరిపడా బ్యాలెన్స్ లేకుండా నగదు విత్ డ్రా చేస్తే ఫైన్ పడనుంది. ప్రతి లావాదేవికి రూ.10 ప్లస్ జీఎస్‌టీ ఛార్జీ వసూలు చేయనుంది పీఎన్‌బీ బ్యాంక్. ఈ నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిక తమ కస్టమర్లను అలర్ట్ చేస్తూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో నోటీసు జారీ చేసింది. అదేవిధంగా ఏటీఎమ్‌ లావాదేవీలు విఫలమైతే విధించే ఛార్జీల గురించి వినియోగదారులకు ఎస్ఎంఎస్ పంపించి అప్రమత్తం చేస్తోంది. 

ఒకవేళ మీ అకౌంట్‌ తగినంత బ్యాలెన్స్ ఉన్నా.. ఏటీఎమ్ నుంచి డబ్బు విత్ డ్రా చేసే సమయంలో ఫెయిల్ అయితే పీఎన్‌బీ బ్యాంక్ మార్గదర్శకాలను రూపొందించింది. 

==> ఏటీఎంలో లావాదేవీ విఫలమైతే పీఎన్‌బీ కస్టమర్ కేర్ సెంటర్‌కు 0120-2490000 లేదా టోల్ ఫ్రీ నంబర్‌లు 1800180222, 18001032222కు ఫిర్యాదు చేయవచ్చు.

==> ఏటీఏం నుంచి నగదు లావాదేవీ విఫలమైతే.. మీ సమస్యను బ్యాంక్ ఏడు రోజుల్లో పరిష్కరిస్తుంది.

==> లావాదేవీ జరిగిన 30 రోజులలోపు క్లెయిమ్ చేయకపోతే.. ఫిర్యాదును ఆలస్యంగా పరిష్కరించినందుకు రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లిస్తుంది.

Also Read: Hyderabad Boy Murder: నరబలి కలకలం.. బాలుడు దారుణ హత్య.. ఎముకలు విరిచి, బకెట్‌లో కుక్కి..  

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. బ్యాంక్ సేవలతో ఎంతవరకు సంతృప్తి చెందారని అడుగుతోంది. పీఎన్‌బీ వెబ్‌సైట్‌ను సందర్శించి.. మీరు ఈ సర్వేలో పాల్గొననవచ్చు. పీఎన్‌బీ సేవల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలతో మీరు సంతృప్తి చెందారా..? లేదా..? అని మీ అభిప్రాయం బ్యాంక్‌కు దృష్టికి తీసుకెళ్లవచ్చు.

Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News