Vizag Steel Plant EOI Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈఓఐ బిడ్డింగ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. సింగరేణి ముందుకొచ్చేనా ?

Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోనేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈవోఐ బిడ్స్ గత నెల 27న ఆహ్వనించింది. బిడ్ల ముఖ్య ఉద్దేశం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-3ని రక్షించుకోవడమే. విశాఖ ఉక్కులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నరగా మూతపడి ఉంది. అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 04:20 AM IST
Vizag Steel Plant EOI Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఈఓఐ బిడ్డింగ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. సింగరేణి ముందుకొచ్చేనా ?

Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 15వ తేదిన ఈవోఐకు సంభందించి చివరి తేది అని స్టీల్ ప్లాంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకొన్ని సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంతో, ఈ నెల 20వ వరకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేఫద్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ బిడ్డింగ్ లో పాల్గొంటుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే 22 సంస్థలు ముందుకు రాగా అందులో 6 విదేశీ సంస్థలు, 16 దేశీయ సంస్థలు పోటీ పడుతున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ కథేంటంటే..
797 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోనేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈవోఐ బిడ్స్ గత నెల 27న ఆహ్వనించింది. బిడ్ల ముఖ్య ఉద్దేశం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-3ని రక్షించుకోవడమే. విశాఖ ఉక్కులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నరగా మూతపడి ఉంది. అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. మిగతా రెండు ఫర్నేస్‌లు అతి కష్టం మీద నడుస్తున్నా, బీఎఫ్-3 మాత్రం ముడిసరకు లేకపోవడంతో మూతపడింది. కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహయం రాకపోవడంతో ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే... దానికి బదులుగా ఉక్కును ఇస్తాం లేదా మూలధనం కింద 5వేల కోట్లు ఇవ్వాలంటూ ఈవోఐ ప్రకటన చేసింది. 

అసలు కథ తిరుగుతోందంతా ఈ బిఎఫ్-3 చుట్టే..
విశాఖ ఉక్కు పరిశ్రమలో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. ఇందులో బీఎఫ్-3 పెద్దది. ఇది రోజుకు 7 నుంచి 8 వేల టన్నులు స్టీల్ తయారు చేయగలదు. దీని నిర్వహణకు 3 వేల టన్నులకు పైగా కోకింగ్ కోల్ ఉపయోగిస్తారు. దీన్ని నిర్వహించాలంటే మూడు నెలలకు సరిపడా ముడి సరుకు సిద్ధంగా ఉండాలి. స్టీల్ ప్లాంట్ 2021-22లో రూ. 28 వేల కోట్ల టర్నోవర్‌తో వెయ్యి కోట్లు లాభం పొందగా, బీఎఫ్-3 అందుబాటులో లేని కారణంగా ఒక్క 2022-23లోనే రూ.23 వేల కోట్ల టర్నోవర్‌తో నష్టాల్లోకి వెళ్లింది. బీఎఫ్-3 వినియోగించినా, వినియోగించకున్నా దాని పరికరాలు దెబ్బతినకుండా కాపాడుకునేందుకు కోట్ల రూపాయలను నిర్వహణ వ్యయంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటు స్టీల్ ప్లాంట్ ను నష్టాలు నుండి బీఎఫ్ -3ని రక్షించుకోనేందుకు ఈవోఐ ద్వారా ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చునని స్టీల్ యాజమాన్యం భావిస్తుంది.

ఎవరెవరు బిడ్డింగ్ వేశారంటే..
విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి పదార్థాలు, ఆర్థిక సాయం అందించడానికి మొత్తం 22 సంస్థలు బిడ్లు వేశాయి. అవీ ఇండో ఇంటర్‌ ట్రేడ్‌ ఏజీ (స్విట్జర్లాండ్‌), ఇండో ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ (దుబాయ్‌), ఐఎంఆర్‌ మెటలర్జికల్‌ రిసోర్సెస్‌ ఏజీ, సూరజ్‌ముల్‌ బైజ్యనాథ్‌ ప్రైవేటు లిమిటెడ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వినార్‌ ఓవర్‌సీస్‌ (ముంబై), టీయూఎఫ్‌ గ్రూపు (ఢిల్లీ), జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ (అంగుల్‌), అగోరా పార్టనర్స్‌, శ్రీసత్యం ఇస్పాత్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎస్‌బీ ఇంటర్నేషనల్‌ ఇన్‌ కార్పొరేషన్‌ (డల్లాస్‌), టాటా ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, యురోపా ఇంపోర్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌, గ్లోబల్‌ సాఫ్ట్‌ పీటీఈ లిమిటెడ్‌ (సింగపూర్‌), వెన్స్‌ప్రా ఇంపెక్స్‌ (విజయవాడ-మాజీ జేడీ లక్ష్మీనారాయణ), ఎలిగెంట్‌ మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎల్‌కే శ్రీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ, అరోగ్లోబల్‌ కామ్‌ ట్రేడ్‌, ఎవెన్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌, వాడిమ్‌ నోవిన్‌స్కై అలెగ్జాండ్రా, రూటేజ్‌ ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో ఆరు వరకు విదేశీ సంస్థలు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన ఓ సంస్థ ఎన్ని నిధులు కావాలన్నా సమకూరుస్తామని, తమకు స్టీల్‌ సరఫరా చేయాలని కోరినట్టు తెలిసింది. విశాఖ ఉక్కు కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఎన్‌ఎండీసీ, సెయిల్‌ వంటి సంస్థలు ఈ బిడ్‌లో పాల్గొనేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినా.. దానికి తగిన ప్రతిస్పందన రాలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవీ బిడ్లు వేయలేదు.

ఇది కూడా చదవండి : Minister Harish Rao: ఏపీలో రెండు పార్టీలు నోరు మూసుకున్నాయి.. వైసీపీ, టీడీపీలకు మంత్రి హరీష్‌ రావు చురకలు

రోలింగ్‌ మిల్స్‌ను తమకు ఇవ్వాలని కోరుతున్న సంస్థలు..
బిడ్‌ వేసే సంస్థలకు చేసిన సాయానికి బదులుగా స్టీల్‌ ఉత్పత్తులు ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. అయితే కొన్ని స్టీల్‌ సంస్థలు ఇక్కడి ప్లాంటులో రోలింగ్‌ మిల్స్‌ను కూడా తమకు ఇవ్వాలని కోరుతున్నాయి. అలా ఇస్తే... ఇక్కడే వారి సంస్థల పేరుతో ఉత్పత్తులు చేసుకొని మార్కెట్‌లోకి తెస్తారని, దానివల్ల విశాఖ స్టీల్‌కు నష్టం జరుగుతుందని కార్మికవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాంటి అవకాశం ఇవ్వవద్దని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి : Thota Chandrasekhar Press Meet: ఇది ఏపీలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం

రోలింగ్‌ మిల్స్‌ అంటే...
రోలింగ్‌ మిల్స్‌ అంటే... స్టీల్‌ రంగంలోని చిన్న చిన్న సంస్థలు ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుంచి బిల్లెట్లు అంటే పెద్ద పెద్ద స్టీల్‌ స్తంభాలు తీసుకొని వాటిని సొంత రోలింగ్‌ మిల్స్‌ ద్వారా వైర్‌ రాడ్స్‌గా మార్చుకుంటాయి. వాటిపై ఆయా సంస్థల పేరుతో బ్రాండింగ్‌ చేసుకొని అమ్ముకుంటాయి. వీటిని నిర్మాణ రంగంలో అధికంగా వినియోగిస్తారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు కూడా ఇలాంటి రోలింగ్‌ మిల్స్‌ ఉన్నాయి. ఈఓఐలో బిడ్లు వేసే సంస్థలకు ఇక్కడి రోలింగ్‌ మిల్స్‌ ఇస్తే నష్టమని, వేరే బ్రాండ్లను ఇక్కడ తయారుచేసినట్టు అవుతుందని, అలా చేయవద్దని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జేఎస్ పీఎల్‌, జేఎస్ డబ్ల్యూ ఉక్రేయిన్ వంటి సంస్థలు ఇలా రోలింగ్‌ మిల్స్‌ కోరినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే, భారీగా ఆస్తులు కలిగి ఉండటంతో పాటు, లాభాల్లో ఉన్నామని చెప్పుకుంటున్న సింగరేణి కాలరీస్ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్ లో పాల్గొంటుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.

ఇది కూడా చదవండి : KTR About Vizag Steel Plant: కేసీఆర్ మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News