Megastar Chiranjeevi to take Care of Balagam Mogilaiah Eyes: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈరోజు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్న ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తాను సంపాదించిన డబ్బులో సింహభాగం అవసరంలో ఉన్నవారికి ఖర్చు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితో అనేక సేవలు చేస్తున్న ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దానికి కారణం ఇటీవల బలగం సినిమాతో ఫేమస్ అయిన మొగిలయ్య. జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి బలగం అనే సినిమా రూపొందించాడు. తెలంగాణ నేపథ్యంలోని పిట్ట ముట్టుడు సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఏడిపిస్తుంది. ఈ క్లైమాక్స్లో పాట పాడిన మొగిలయ్యకు ఈమధ్య కాలంలో తీవ్ర అస్వస్థత ఏర్పడింది.
నిజానికి గత 30 సంవత్సరాలుగా మొగిలయ్య డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయనకు రెండు కిడ్నీలు పాడవడంతో ఏడాది కాలం నుంచి రెగ్యులర్ గా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆయనకు తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో ఆయనను హాస్పిటల్ కి తరలించారు. ముందుగా వరంగల్ లో, తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి నిమ్స్ లో రక్త పరీక్షలు చేయించి కొంత కుదుట పడేలా చేశారు. ఆయనకు దీర్ఘకాలంగా మధుమేహం ఉండడంతో కంటి చూపు కూడా మందగించింది.
కంటి వైద్య నిపుణులని సైతం రప్పించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి వెంటనే డైరెక్టర్ వేణుకి ఫోన్ చేసి మొగులయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చైనా తాను భరిస్తానని ఆయనకు కంటి చూపు వచ్చేలా చేద్దామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు మొగలయ్య దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా మొగిలయ్య దంపతులను ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత సాయం చేసి కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ పబ్లిసైజ్ చేసుకోలేదని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
ఇదీ చదవండి: Karthik Varma Dandu Health: ‘విరూపాక్ష’ డైరెక్టర్ కి అరుదైన వ్యాధి.. బతకడు అనుకున్నా.. బయటపెట్టిన సుకుమార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook