Radisson Pub: టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ప్రస్తుతం కలకలం రేపుతోంది. అయితే హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యవహారంతో సంచలనంగా మారిన రాడిసన్ హోటల్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్సులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
24 గంటలపాటు మద్యం సరఫరాకు రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. ఈ మేరకు జనవరి 21న రాడిసన్ హోటల్‌కు అనుమతి లభించింది. రూ.56 లక్షలు బార్ టాక్స్ చెల్లించి లిక్కర్ సప్లైకి నిర్వాహకులు అనుమతిని తీసుకున్నారు. 2B బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొందినట్లు తెలుస్తోంది.
అయితే పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటం వల్ల తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇప్పుడు చర్యలు చేపట్టింది. పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుపడటంతో కలకలం రేగింది. దాదాపు 150 మంది అర్థరాత్రి రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో మెగా డాటర్ నిహారిక, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పేర్లు సైతం బయటకు రావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read: Hyderabad: మందు బాబులకు గుడ్ న్యూస్... బార్ షాప్స్ టైమింగ్స్ పొడగించిన సర్కార్
Also Read: డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు.. ప్రముఖ బీజేపీ నేత కుమారుడు... బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook