AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు కీలక తీర్పు.. జంబ్లింగ్ నోటిఫికేషన్ సస్పెండ్!

AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల జంబ్లింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జంబ్లింగ్ విధానాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఈ తీర్పుతో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను విద్యార్థులు వారి వారి కళాశాలల్లోనే రాసేందుకు అవకాశం ఉంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 02:08 PM IST
AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు కీలక తీర్పు.. జంబ్లింగ్ నోటిఫికేషన్ సస్పెండ్!

AP Inter Practical 2022: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జంబ్లింగ్ విధానాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే గతంలో ఇంటర్ పరీక్షా విధానంలో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కొందరు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టింది. 

అయితే ఇప్పుడు ఇంటర్ పరీక్షల జంబ్లింగ్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రాక్టికల్స్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. నేటి (గురువారం) సాయంత్రం లోపు అధికారులు మరో కొత్త షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుతో విద్యార్థులు తమ సొంత కాలేజీల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ఇంటర్​ పరీక్షలకు కొత్త షెడ్యూల్​..

విద్యాశాఖ గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. అయితే ఇటీవలే ఆ షెడ్యూల్ ను మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 8 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 22న మొదలయ్యే ఇంటర్ పరీక్షలు.. మే 12 వరకు జరగనున్నాయి.

మరోవైపు జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ రెండు రోజుల కిందట ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.  

Also Read; AP Elections: ఏపీలో చర్చనీయాంశంగా మారుతున్న ముందస్తు ఎన్నికల అంశం, జగన్ వ్యూహమేంటి

Also Read: Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట.. మరి వైసీపీ ఏమంటోంది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News