Blood Clotting: శరీరంలో రక్తం గడ్డకడుతుందా? కారణమేంటో ఇప్పుడే తెలుసుకోండి!

Causes Of Blood Clotting: మారుతున్న జీవన ప్రమాణాలు, వాతావరణ మార్పుల కారణంగా మానవుడు అనేక జబ్బుల బారిన పడుతున్నారు. తాజాగా రక్తం గడ్డ కట్టే సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. అయితే రక్తం గడ్డ కట్టే సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2024, 03:28 PM IST
Blood Clotting: శరీరంలో రక్తం గడ్డకడుతుందా? కారణమేంటో ఇప్పుడే తెలుసుకోండి!

Causes Of Blood Clotting: రక్తం గడ్డకట్టడం వంటి చర్య శరీరంలో సాధారణంగా జరుగుతుంది. ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా గాయాలైనప్పుడు శరీరం నుంచి రక్తం ఎక్కువగా బయటకి పోకుండా రక్తఫలికికలు సహకరిస్తాయి. రక్తం ఎక్కువగా బయటకి పోకుండా రక్తాన్ని గడ్డకట్టే విధంగా చర్యలు చేపడతాయి. అయతే ఈ ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పుల కారణంగా చాలా మందిలో రక్తం గడ్డకట్టే సమస్య వచ్చింది. 

కేవలం గాయాలైనప్పుడే కాకుండా శరీరంలో రక్తం పారే నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇలా రక్తం గడ్డ కట్టడం వల్ల కొందరు హఠాన్మరణాలకు గురవుతున్నారు. అయితే అసలు మన శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రక్తం గడ్డ కట్టడానికి అసలైన కారణాలు..
 

1. మన గుండెలో స్పందనలు సరైన విధానంలో లేకపోయినా శరీరంలో రక్తం సరఫరాలో అంతరాయం ఏర్పడి గడ్డ కట్టే అవకాశం ఉంది. 

2. మరోవైపు గుండెపోటు లేదా హార్ట్ ఎటాక్ కారణంగానూ శరీరంలో రక్తం గడ్డ కడుతుందని నిపుణులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ కారణంగా గుండె కణజాలం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కారణంగా శరీరంలోని రక్తం గడ్డకడుతుంది. 

3. అదే విధంగా ఒక భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడం వంటి చర్యల వల్ల కూడా రక్తం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో రక్తం గడ్డకడుతుంది.  

4. అతిగా పొగ త్రాగడం లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా రక్తం గడ్డ కట్టే సమస్య ఎదురవుతుంది. పొగతాగే వారి రక్తంలో నికోటిన్ స్థాయి భారీగా పెరుగుతుంది. దీని వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనుల గోడలను గట్టి పరుస్తాయి. దీంతో రక్తం గడ్డ కడుతుంది. చెడు అలవాట్లు కూడా ఈ పరిస్థితికి దారి తీయోచ్చు. 

5. మరోవైపు డయాబెటిస్‌తో బాధపడే వారు కూడా సరైన ఆహారం తీసుకోవాలి. అలా సమతుల్య ఆహారం తీసుకోని క్రమంలో శరీరంలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. 

6. మహిళలు గర్భధారణ సమయంలోనూ ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. కాళ్లు, పొత్తికడుపులో గర్భవతులకు రక్త ప్రవాహం మందకొడిగా ఉంటుంది. గర్భిణులు అధిక బరువుతో ఉండే కారణంగా వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. 

7. అధిక రక్తపోటు కారణంగా ధమనులు గట్టిపడే అవకాశం ఉంది. దీంతో సరైన రక్త ప్రసరణ ఉండదు. అదే సమయంలో అధిక రక్తపోటు (హై బీపీ) అనేది రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టేందుకు కారణంగా మారుతుంది. 

రక్తం గడ్డ కట్టే ముందు లక్షణాలు..

శరీరంలో రక్తం గడ్డ కట్టేముందు అనేక రకాల లక్షణాలు మన శరీరంలో ఏర్పడతాయి. అలాంటి లక్షణాలే రక్తం గడ్డ కట్టడానికి మూల కారణం అవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, సరిగా మాట్లాడలేకపోవడం, కాళ్లు చేతులు తిమ్మెర్లు ఎక్కడం, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News