White Rice: వైట్ రైస్‌తో బరువు తగవచ్చని మీకు తెలుసా, తీసుకునే విధానమిదీ

White Rice: వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారనేది అందరూ చెప్పే మాట. కానీ ఇది పూర్తిగా తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆశ్చర్యంగా ఉంది కదూ..బరువు తగ్గేందుకు వైట్ రైస్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 2, 2022, 12:00 AM IST
White Rice: వైట్ రైస్‌తో బరువు తగవచ్చని మీకు తెలుసా, తీసుకునే విధానమిదీ

White Rice: వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారనేది అందరూ చెప్పే మాట. కానీ ఇది పూర్తిగా తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆశ్చర్యంగా ఉంది కదూ..బరువు తగ్గేందుకు వైట్ రైస్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

స్థూలకాయం లేదా అధిక బరువు తగ్గించుకునేందుకు చాలామంది జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. జిమ్‌లో వర్కవుట్లు చేసేటప్పుడు సరైన డైట్‌ఛార్ట్ కూడా సిద్ధం చేసుకోవాలి. అప్పుడే బరువు వేగంగా తగ్గించుకోగలం. బరువు తగ్గేందుకు బ్యాలెన్స్ ఆహారముండాలి. అంటే తినే తిండి బ్యాలెన్స్‌గా ఉండాలి. పూర్తిగా ఎప్పుడూ మానేయకూడదు. చాలామంది డైట్‌ఛార్ట్‌లో వైర్ రైస్ చేర్చరు. ఇది పూర్తిగా తప్పంటున్నారు వైద్య నిపుణులు.

ఇండియాలో అత్యంత ప్రాచుర్యం కలిగిన భోజనం పప్పన్నం. ఉత్తరాదిన దాల్ చావల్‌గా పిలుస్తారు. బరువు తగ్గించేందుకు ఈ రెండింటినీ కలిపి ఒకేసారి పరిమితంగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. పెసర, మినప, శెనగ పప్పుల్ని స్ప్రౌట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్‌తోపాటు కార్బ్స్ కూడా ఉంటాయి.ఇవి తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. 

బరువు వేగంగా తగ్గాలనుకుంటే..వైట్ రైస్‌ను రోజుకు ఒకసారి తీసుకోవాలి. లంచ్ లేదా డిన్నర్‌లో తీసుకోవాలి. డైట్ ప్రకారం అన్నం కొద్దిగా తీసుకుని..చికెన్ లేదా ఎగ్‌తో తీసుకోవాలి. అదే సమయంలో సలాడ్, పప్పు, కూరగాయల్ని మిక్స్ చేసి తీసుుకంటే ఇంకా మెరుగైన ఫలితాలుంటాయి. వేగంగా బరువు తగ్గించేందుకు కూరగాయల్ని డైట్‌లో చేర్చాలి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. 

బరువు తగ్గడం లేదా పెరగడం అనేది ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటున్నామనే విషయంపై ఆధారపడి ఉంటుంది. వైట్ రైస్‌తో బరువు తగ్గడం, పెరగడం రెండూ ఉంటాయి. బరువు తగ్గించేందుకు బియ్యం ఉడికించి..తినవచ్చు. అయితే బియ్యం అంటే వైట్ రైస్ రోజుకు ఒకసారి, సాధ్యమైనంతవరకూ మధ్యాహ్నం వేళ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

Also read: How To Glow Skin At Home: బంగాళాదుంప రసంతో కూడా చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.. ఎలానో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News