White Onion: మధుమేహం, క్యాన్సర్ వ్యాధులకు ఇలా సులభంగా వీటితో చెక్‌ పెట్టొచ్చు..

White Onion For Diabetes Cancer: ఎరుపు రంగు ఉల్లిపాయలకంటే తెలుపు రంగు ఉల్లిపాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 06:09 PM IST
  • మధుమేహం, క్యాన్సర్ వ్యాధులకు
  • ఇలా సులభంగా తెలుపు రంగు
  • ఉల్లిపాయాలు తీసుకోండి..
White Onion: మధుమేహం, క్యాన్సర్ వ్యాధులకు ఇలా సులభంగా వీటితో చెక్‌ పెట్టొచ్చు..

White Onion For Diabetes Cancer: సాధారణంగా ఉల్లిపాయలు భారత్‌లో రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. మొదటిది సాధారణంగా లభించే ఎరుపు రంగు ఉల్లిపాయలైతే.. రెండవది చాలా అరుదుగా లభించే తెల్ల ఉల్లిపాయలు. తెలుపు రంగు ఉల్లిపాయల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంలో వినియోగించడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు తీవ్ర ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేసేందుకు సహాయపడతాయి. అయితే ఈ తెల్ల ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

మధుమేహం:
తెల్ల ఉల్లిపాయలు మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రభావంతంగా పనిచేస్తా యి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

క్యాన్సర్:
ప్రస్తుతం క్యాన్సర్ ఓ సాధారణ సమస్యగా మారింది. భారత్లో రోజురోజుకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. అయితే క్యాన్సర్ నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ తెల్ల ఉల్లిపాయ లు ప్రభావంతంగా సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణాలు అధికంగా లభిస్తాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు పచ్చిగా ఆహారంలో తీసుకుంటే సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

జీర్ణక్రియ:
తెల్ల ఉల్లిపాయలను తినడం జీర్ణ సంబంధిత సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో జీర్ణ క్రియ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుపర్చడానికి సహాయపడుతాయి.

రోగనిరోధక:
శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించేందుకు సహాయపడుతుంది. అయితే శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు తెల్ల ఉల్లిపాయలు సహాయపడతాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని వినియోగించాలి.

Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News