White Hair To Black Hair Naturally: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. పెద్దవారిలోనే కాకుండా యువకుల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి తెల్ల జుట్టుతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమన పొందడానికి మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలను పొందలేకపోతున్నారు. తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించండి.
ఈ చిట్కాలతో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం!
ఉసిరి పొడి, కొబ్బరి నూనె:
తెల్ల వెంట్రుకలను నల్లగా చేసేందుకు ఉసిరి పొడి, కొబ్బరి నూనె మిశ్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును బలోపేతం చేస్తుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 2 చెంచాల కొబ్బరి నూనెను తీసుకుని..అందులో ఉసిరి పొడిని వేసుకోవాలి. ఇలా రెండు మిశ్రమాలను మిక్స్ చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. అప్లై చేసిన గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లగా దృఢంగా మారడం ఖాయం.
ఉసిరి, కుంకుడు కాయ:
ఉసిరి, కుంకుడు కాయ పొడి మిశ్రమం కూడా జుట్టును నల్లగా అందంగా చేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఒక చిన్న బౌల్‌లో 4 చెంచాల కుంకుడు కాయ పొడి వేసి అందులోనే..ఉసిరి పొడిని కలిపి కొబ్బరి నూనెను వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే.. సులభంగా జుట్టు సమస్యలు దూరమవుతాయి. తెల్ల జుట్టు సులభంగా నల్ల జుట్టుగా మారుతుంది.
ఇండిగో పౌడర్, సహజ హెన్నా:
ఇండిగో పౌడర్, సహజ హెన్నా కూడా తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు దోహదపడుతుంది. అయితే వేగంగా నల్ల జుట్టును పొందాలనుకుంటే..జుట్టుకు సహజ హెన్నా వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం ఒక చెంచా హెన్నా ఒక బౌల్‌లో వేసి అందులోనే పెరుగు, గుడ్డు కలిపి జుట్టుకు అప్లై చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాను పాటించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook