Wheat Grass Juice: గోధుమ గడ్డి రసంతో బరువు తగ్గడమే కాకుండా ఇలా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించుకోవచ్చు.!

Wheat Grass Juice For Weight Loss And Bad Cholesterol: ప్రతిరోజు గోధుమ గడ్డి తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు తీవ్రవ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కింది వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2023, 08:36 PM IST
Wheat Grass Juice: గోధుమ గడ్డి రసంతో బరువు తగ్గడమే కాకుండా ఇలా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించుకోవచ్చు.!

 

Wheat Grass Juice For Weight Loss And Bad Cholesterol: భారతీయులు ఎక్కువగా వినియోగించే ఆహారాల్లో గోధుమలతో తయారుచేసినవే అధికం.. అందుకే ఆరోగ్య నిపుణులు తయారు చేసిన ఆహారాలను పౌష్టిక ఆహారంగా భావిస్తారు. భారతీయులు వీటితో తయారుచేసిన ఆహారాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఈ ఆహారాలు శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అనేక రకాలుగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం చాలామంది గోధుమలతో పాటు వాటి గడ్డిని కూడా వినియోగిస్తున్నారు. ఈ పచ్చి గోధుమ గడ్డిలో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ గడ్డిని రసంలా తయారు చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేయాలో? ఈ గడ్డి రసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ గడ్డి రసంలో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సితో పాటు కాల్షియం ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మీరు ఈ గడ్డిని రసంలా తయారు చేసుకుని తాగడం వల్ల పోషక లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ఈ రసం ఔషధంగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

గోధుమ గడ్డి రసం తాగితే ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు:
జీర్ణ క్రియ సమస్యలు తగ్గుతాయి:

ప్రస్తుతం చాలామంది జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా మలబద్ధకం పొట్ట ఉబ్బరం వంటి అనేక సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోధుమ గడ్డితో తయారుచేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కులాలు ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుతాయి.

శరీర బరువును తగ్గిస్తుంది:
గోధుమ గడ్డి రసంలో ఫైబర్ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తాగడం వల్ల శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

కొలెస్ట్రాలను నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలామంది గుండెపోటు సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు గోధుమ గడ్డి తో తయారు చేసిన రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని పేరుకుపోయిన తీవ్ర కొలెస్ట్రాల్ను కూడా సులభంగా కరిగిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే గుండెపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News