Weight Loss With Healthy Breakfast: ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. భారత్లో ప్రతి పదిమందిలో ఐదుగురు బరువు పెరుగుతుండడం విశేషం. అయితే పరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలామందిలో స్థూలకాయం, మధుమేహం, గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారంలో తప్పకుండా పోషకాలు ఉన్నా ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది.. బరువు తగ్గడానికి ఓట్స్ తో చేసిన ఆహార పదార్థాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదయం పూట తీసుకొని అల్పాహారంలో వీటితో చేసినవి తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చ. ఆహార పదార్థాలు ఏంటో.. దానిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
1. ఓట్స్
2. కొవ్వు తక్కువ పరిమాణంలో ఉన్న పాలు
3. చియా గింజలు
4. తేనె
5. అరటి పండ్లు
6. వాల్ నట్స్
7. బాదం
8. పిస్తా
ఓట్స్ తో తయారు చేసిన అల్పాహారానికి.. ముందుగా ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో తగినన్ని ఓట్స్ వేసుకొవాలి. అందులో పాలను వేసుకోవాలి ఆ తర్వాత చియా వేసుకుని ఫైన్ గా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తేనె, బాదం, వాల్నట్స్, పిస్తా, అరటి పండ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని రాత్రంతా పక్కన పెట్టేసి.. ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా వేగంగా బరువు తగ్గుతారు.
కాబట్టి బరువు సులభంగా తగ్గాలనుకునేవారు రోజూ ఉదయం పూట ఇలాంటి అల్పాహారాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందలో శరీరానకి అవసరమైన పోషకాలు ఉండడమేకాకుండా.. శరీరాన్ని ధృఢంగా చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఇలా ఉదయం పూట ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook