Weight Loss In 10 Days: భారత్‌లో చలికాలం ప్రారంభం కాననుంది. అయితే చాలా మంది ఈ క్రమంలో వివిధ రకాల ఆహారాలు తినడం వల్ల బరువు పెరుగుతారు. అంతేకాకుండా వాతావరణంలో పలు రకాల మార్పులు కూడా సంభవిస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బరువు పెరగకుండా పలు రకాల డ్రింక్స్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రింక్స్ తీసుకోవడం వల్ల శరీరం అరోగ్యంగా ఉండడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా బరువు కూడా సులభంగా తగ్గుతారు. అయితే ఎలాంటి డిటాక్స్ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారో తెలుసుకుందాం..
చలికాలంలో బరువు తగ్గాలంటే ఈ డిటాక్స్ డ్రింక్ తాగండి:
దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ :
దానిమ్మ పండులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా అల్పాహారంలో భాగంగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. దానిమ్మ, బీట్రూట్ జ్యూస్ లను కలిపి జ్యూస్‌లా చేసుకునే తాగడం వల్ల అనారోగ్యలు దూరం కావడమేకాకుండా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బీట్రూట్ జ్యూస్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ శక్తిని పెంచి శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది.
ఆరెంజ్, క్యారెట్ జ్యూస్:
ఆరెంజ్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా క్యారెట్లో ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి వీటిని జ్యూస్‌లా చేకుని తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలను తొలగించి..బరువు తగ్గడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ఉసిరి రసం:
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి శరీరం జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఉసిరికాయ రసంలోని పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే ఈ రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది ఉచితంగా కావాలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook