ఫ్లక్స్ సీడ్స్ ఆరోగ్యపరంగా అద్భుతమైనవి. అధిక రక్తపోటును తగ్గించడంలో, బరువు నియంత్రణలో, బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అవిశె గింజల పాత్ర అమోఘమనే చెప్పాలి. చాలామంది వంటల్లో రుచి కోసం ఉపయోగిస్తుంటారు. సరైన విధానంలో ఉపయోగించడం ద్వారా ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆధునిక జీవనశైలిలో అధిక బరువు, అధిక రక్తపోటు వంటివి ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ముఖ్యంగా బరువు నియంత్రణ ఓ సవాలుగా మారుతోంది. దీనికి తోటు పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయే కొవ్వు మరింత ప్రమాదకంగా మారుతోంది. బరువు తగ్గించేందుకు చేసే చాలా ప్రయత్నాలు విఫలమౌతుంటాయి. వ్యాయామంతో పాటు రోజూ క్రమం తప్పకుండా అవిశె గింజలు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ అనేది శరవేగంగా కరుగుతుంది. అవిశె గింజల వినియోగంతో కేవలం బరువు తగ్గించుకోవడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అవిశె గింజల్లో ఉండే న్యూట్రియంట్లు
అవిశె గింజలు చూసేందుకు చాలా చిన్నవే అయినా ఇవి సూపర్‌ఫుడ్ కంటే తక్కువేమీ కావు. శరీర వృద్ధికి చాలా అవసరం. ఈ సీడ్స్‌లో ఉండే వివిధ రకాల పోషక పదార్ధాలతో మనిషి శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిజ్స్, హెల్తీ ప్రోటీన్స్, ఫెనోలిక్ కాంపౌండ్, మినరల్స్ చాలా ఉంటాయి. ఫ్లక్స్ సీడ్స్‌ను రెగ్యులర్ డైట్లో చేరిస్తే చాలా లాభదాయకం.
అవిశె గింజలు లేదా ఫ్లక్స్ సీడ్స్‌తో బరువు ఎలా తగ్గుతుంది
అవిశె గింజలతో చాలా వ్యాధులు దూరం చేయవచ్చు. బరువు తగ్గేందుకు మరింత అద్భుతంగా పనిచేస్తుంది. పొట్ట, నడుము చుట్టూ కొవ్వుని కరిగించడంతో ఫ్లక్స్ సీడ్స్ పాత్ర కీలకం. ఎందుకంటే ఈ సీడ్స్ శరీరంలో ఉండే అధిక కొవ్వుపై అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కొవ్వును కరిగించే న్యూట్రియంట్లు ఉంటాయి. అవిశె గింజలనేవి ముఖ్యంగా ఆకలిని తగ్గిస్తుంది. దాంతో తిండి యావ తగ్గడం ద్వారా బరువు తగ్గడం ప్రారంభమౌతుంది. ఈ సీడ్స్ కారణంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పాలతో లేదే యాపిల్ స్మూదీతో కలిపి ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవచ్చు. ఒక కప్పు పాలు, 2 ఖర్జూరం పండ్లను మిక్సీ చేయాలి. ఇందులో ఒక చెంచా అవిశె గింజల పౌడర్ కలుపుకుని రోజూ తాగితే అత్యంత వేగంగా బరువు తగ్గుతారు.
Also read: Kidney Health Tips: మీ లైఫ్‌స్టైల్ ఇలా మార్చుకుంటే..కిడ్నీ సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook