Weight Loss Snacks: బరువు తగ్గడానికి ఇంతకంటే సులువైన మార్గం ఇంకేదైనా ఉందా?

Weight Loss Belly Fat Snacks: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఆహారంగా ఈ కింది స్నాక్స్‌ తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2023, 04:40 PM IST
 Weight Loss Snacks: బరువు తగ్గడానికి ఇంతకంటే సులువైన మార్గం ఇంకేదైనా ఉందా?

Weight Loss Snacks: బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు పెరగడం సులభమైనప్పటికీ తగ్గడం మాత్రం చాలా కష్టతరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకుంటున్నారు. దీని కారణంగా కూడా సులభంగా బరువు తగ్గలేకపోతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు బరువు తగ్గే క్రమంలో తీసుకునే స్నాక్స్‌లో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డైట్‌ వీటిని స్నాక్స్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. 

బరువు తగ్గేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఈ స్నాక్స్‌ తీసుకోవాలి:
వేయించిన శనగలు:

వేయించిన శనగల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. శరంలో ఆకలిని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు వీటిని స్నాక్స్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.

బాదం:
బాదంలో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూట వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరానికి తగిన పరిమాణంలో పోషకాలు కలుగుతాయి.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  
 
బెర్రీలు:
బెర్రీలు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీర బరువును వేగంగా నియంత్రించే గుణాలు లభిస్తాయి. దీంతో వీటిని ప్రతి రోజు స్నాక్స్‌గా తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
యాపిల్స్‌:
యాపిల్స్‌లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కేలరీలు కూడా తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ఉదయం ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News