Vastu Tips for house: ఇంట్లో నల్లాలు లీక్ అయితే ఆర్ధిక ఇబ్బందులు తప్పవా ?

Vastu Tips to avoid money problems in house: వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా ఖర్చు అవుతుందో... ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయంట. అయితే, ఇంట్లో నల్లాలు లీక్ అవడానికి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం అనే సందేహం చాలా మందికి కలగవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2023, 10:37 AM IST
Vastu Tips for house: ఇంట్లో నల్లాలు లీక్ అయితే ఆర్ధిక ఇబ్బందులు తప్పవా ?

Vastu Tips to avoid money problems in house: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నల్లాలు లీక్ అవుతున్నాయి అంటే.. అది ఇంట్లో ఆర్థిక సమస్యలను సూచిస్తోందని అర్థం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవును, ఒక ఇంట్లో నల్లాలు లీక్ అయి నీరు వృథాగా పోతోంది అంటే.. ఆ ఇంట్లో డబ్బు కూడా అంతే వృథాగా, అనవసరంగా ఖర్చు అవుతోందని అర్థం అంట. 

వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఏ ఇంట్లో అయితే నీరు వృథాగా ఖర్చు అవుతుందో... ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తిష్ట వేస్తాయంట. ఇంట్లో నల్లాలు లీక్ అవడానికి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం అనే సందేహం చాలా మందికి కలగవచ్చు.

లీక్ అయ్యే నల్లాలకు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులకు ఏంటి సంబంధం ?
వాస్తు శాస్త్రంపై విశ్వాసం లేనివారికే కాదు.. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారిలోనూ కొంతమందికి కలిగే సాధారణ సందేహం ఇది. అయితే, దీనికి వాస్తు శాస్త్రం తెలిసిన వారు చెబుతున్నది ఏంటంటే.. నీరు వృథా అవడం అంటే వరుణ దేవుడికి ఆగ్రహం తెప్పించడమేనని, తద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుంటుందని చెబుతున్నారు. అసలు సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయని చెబుతున్నారు.

వంట గదిలో నల్లాలు లీక్ అయితే ?
వంట గదిలో నల్లాలు లీక్ అవుతున్నాయంటే అది మరీ ఇబ్బందికరం అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వంట గదిలో నిప్పు ఉంటుంది కనుక.. నిప్పు ఉన్న చోట నీళ్లు కారడం అశాంతికి సూచన అంటున్నారు. అగ్ని దేవుడు ఉండే చోట నీరు లీక్ అయితే... అది మరింత నెగటివ్ ఎనర్జీకి దారి తీస్తుందట. ఇది ఇంట్లో కుటుంబసభ్యుల అనారోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు అని వాస్తు శాస్త్రం తెలిసిన పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూాడా చదవండి : Surya Grahan 2023: అక్టోబరులో చివరి సూర్యగ్రహణం.. ఈ రాశులకు కష్టకాలం.. మీరున్నారా?

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు వాస్తు పరిష్కారాలు ఏంటి ? 
లీక్ అయ్యే నల్లలు ఇంట్లో వృథా ఖర్చులను పెంచుతాయి కనుక వీలైనంత త్వరగా ఆ నల్లాలను రిపేర్ చేయించి అనవసర ఖర్చులకు బ్రేక్ వేయడం ద్వారా అర్థిక ఇబ్బందులు నుంచి బయటపడొచ్చు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఎంత సంపాదించినా అది వృథా ఖర్చులకే సరిపోదని హెచ్చరిస్తున్నారు.

ఇది కూాడా చదవండి : Guru Chandal Dosh: మరికొన్ని రోజుల్లో తొలగిపోనున్న గురు చండాల దోషం.. ఈ 5 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News