Camphor Powder: కర్పూరాన్ని ఇలా వాడండి.. పది నిమిషాల్లో మీ తెల్ల జుట్టు..నల్లగా మారడం ఖాయం

Camphor Powder Benefits: ఆరోగ్యవంతమైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు. కానీ ఈమధ్య అందరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో తెల్లజుట్టు కూడా ఒకటి. కానీ కర్పూరాన్ని ఇలా వాడటం వల్ల మీ తెల్ల జుట్టు కాస్త వెంటనే నల్లగా మారిపోతుంది. అదెలాగో తెలుసుకుందాం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 27, 2024, 09:33 PM IST
Camphor Powder: కర్పూరాన్ని ఇలా వాడండి.. పది నిమిషాల్లో మీ తెల్ల జుట్టు..నల్లగా మారడం ఖాయం

Camphor for White Hair: ఈమధ్య చిన్న పెద్ద తేడా లేకుండా బయట పొల్యూషన్ కారణంగా, లేదా లైఫ్ స్టైల్ కారణంగా, ఆహారాలవాట్ల కారణంగా అందరి చుట్టూ నెరిసిపోతూ ఉంటుంది. చిన్నవయసులోనే తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. కానీ మన ఇంట్లో దొరికే కర్పూరంతో కూడా మన తల జుట్టుని త్వరగా నల్లగా మార్చుకోవచ్చు. 

కర్పూరం ఉపయోగాలు:

కర్పూరంలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు మన జుట్టుని ఆరోగ్యవంతంగా మారుస్తాయి. జుట్టు పొడిపొడి పోకుండా చేసి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా కాపాడతాయి. అంతేకాకుండా కర్పూర నూనె రాసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరిగి కుదుళ్ళు గట్టిపడటంతో పాటు జుట్టు కూడా త్వరగా పెరుగుతుంది. మన జుట్టుకి కావలసిన పోషకాలన్నీ కర్పూరంలో దొరుకుతాయి. 

చుండ్రు సమస్యలు మటుమాయం:

అంతేకాకుండా చుండ్రు సమస్యలు ఉన్నవారికి కూడా కర్పూరం బాగా ఉపయోగపడుతుంది. అందులో ఉండే ఆంటీ ఫంగల్ గుణాలు డాండ్రఫ్ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. కర్పూర నూనె తలకు రాసుకోవడం వల్ల దురదలు మంటలు వంటివి తగ్గడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. 

కొబ్బరి నూనెతో:

ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉన్న వాళ్లకి కూడా కర్పూర నూనె బాగా ఉపయోగపడుతుంది. ఇక కర్పూరపు పొడిని కొబ్బరి నూనెతో కలిపి వాడితే అది మన జుట్టుకి దివ్య ఔషధంగా మారుతుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఈ నూనె అద్భుతంగా ఉపయోగపడుతుంది.

నూనె ఎలా తయారు చేసుకోవాలి:

కర్పూరపు పొడి, కొబ్బరి నూనె రెండూ సమాన కొలతల్లో తీసుకోవాలి. మన జుట్టు పొడవుని బట్టి, జుట్టు మొత్తం సరిపడేలా ఈ రెండిటినీ కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.

ఎలా వాడాలి: 

ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకి బాగా పట్టించాలి. జుట్టు మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని చక్కగా రాసుకోవాలి. ఒక 20 నుంచి 30 నిమిషాలు అలా వదిలేసిన తరువాత షాంపూ తో తల స్నానం చేయాలి. 

ఇలా తరచుగా మన జుట్టుకి ఈ మిశ్రమాన్ని వాడుతూ ఉండటం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక ఈ మిశ్రమాన్ని ఒకసారి వాడటం వల్లనే తెల్ల జుట్టు చాలావరకు నల్లగా మారిపోతుంది. ఈసారి తలకి కొబ్బరి నూనె రాసుకోవాలి అనుకునేటప్పుడు మర్చిపోకుండా కర్పూరపు పొడిని అందులో జత చేసి చూడండి..

Also Read: IPL 2024 Prize Money: చాంపియన్‌ కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కు, రన్నరప్‌ హైదరాబాద్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News