Mud bathing heath benefits: మడ్ బాతింగ్ ఆరోగ్య ప్రయోజనాలు హైలైట్ చేసిన Urvashi Rautela

Urvashi Rautela mud bathing, Mud bathing health benefits : సినిమాల్లో హీరోయిన్స్ అందంగా ఉండటం చూసి తాము కూడా అలా ఉంటే బాగుండు అని అనుకునే లేడీస్ చాలా మందే ఉంటారట. అందుకేనేమో ఊర్వశి రౌతేలా తన బ్యూటీ సీక్రెట్స్‌లో (Urvashi Rautela beauty secrets) ఒకటైన మడ్ బాత్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత 24 గంటల్లోపే ఆ ఫోటోను ఒక మిలియన్‌పైగా నెటిజెన్స్ లైక్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2021, 08:35 AM IST
Mud bathing heath benefits: మడ్ బాతింగ్ ఆరోగ్య ప్రయోజనాలు హైలైట్ చేసిన Urvashi Rautela

Urvashi Rautela mud bathing, Mud bathing health benefits : సినిమాల్లో హీరోయిన్స్ అందంగా ఉండటం చూసి తాము కూడా అలా ఉంటే బాగుండు అని అనుకునే లేడీస్ చాలా మందే ఉంటారట. తాను కూడా హీరోయిన్స్ లాగే గ్లామరస్‌గా కనిపించాలని కోరుకోని లేడీస్ ఉండరంటే ఆశ్చర్యపోనక్కర్లేదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలా హీరోయిన్స్‌లా ఉండాలని కోరుకునే క్రమంలో హీరోయిన్స్ తమ చర్మ సౌందర్యం కోసం ఏమేం కాస్మెటిక్స్ ఉపయోగిస్తుంటారు, ఎలాంటి వ్యాయమాలు చేస్తుంటారో తెలుసుకోవాలని, అవి మనం కూడా ఫాలో కావాలని ఇంకొంత మంది అనుకుంటుంటారు. సరిగ్గా అటువంటి వారి కోసమే అన్నట్టుగా తన బ్యూటీ సీక్రెట్స్ చెబుతూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మడ్ బాత్ ఫోటో (Urvashi Rautela mud bathing photos) ఒకటి పోస్ట్ చేసింది. 

Urvashi Rautela beauty secrets: ఊర్వశి రౌతేలా తన బ్యూటీ సీక్రెట్స్‌లో ఒకటైన మడ్ బాత్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత 24 గంటల్లోపే ఆ ఫోటోను ఒక మిలియన్‌పైగా నెటిజెన్స్ లైక్ చేశారు. ఆమె తన శరీరమంతా బురదను పూసుకుని ఎండలో కూర్చుని ఉండటం మనం ఆ ఫోటోలో చూడవచ్చు. ఊర్వశి రౌతేలా మడ్ బాత్ ఫోటో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒకసారి మడ్ బాత్ ఆరోగ్య ప్రయోజనాలు (Mud bathing health benefits) ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela)

Also read: Delta Plus Variant of COVID-19: డెల్టా ప్లస్ వేరియంట్ నిజమే, B.1.617.2.1పై స్పందించిన కేంద్రం

Mud bathing heath benefits: మడ్ బాతింగ్ ఆరోగ్య ప్రయోజనాలు..
మడ్ బాతింగ్ చేయడం వల్ల చర్మ వ్యాధులు, గాయాలు ఉన్న వారికి ఉపశమనం ఉంటుంది.

మడ్ థెరపీ (Mud therapy) వల్ల శరీరాన్ని చల్లబడి హాయినిస్తుంది.

శరీరంలో దాగి ఉన్న మలినాలను తొలగించడం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

నీళ్లలో తడిపిన మట్టిని పొట్టపై ప్యాక్ తరహాలో అప్లై చేయడం ద్వారా అజీర్ణం, మలబద్ధకం (Digestion, constipation) సమస్యల నుండి బయటపడవచ్చు.

కళ్ళపై మట్టి ప్యాక్ వేయడం వల్ల కంటి చికాకు, కంటి నొప్పి (Eye pain) నుండి ఉపశమనం పొందవచ్చు.

పొడి చర్మం (Dry skin), కండరాల నొప్పితో బాధపడేవారు మడ్ బాతింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. 

మడ్ బాతింగ్ శరీరం అందాన్ని (Beautiful skin) పెంచుతుంది. అలాగే యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది.

జ్వరం (Fever) నుండి ఉపశమనం పొందడానికి పొట్ట భాగంతో పాటు నుదిటిపై మడ్ ప్యాక్ అప్లై చేయవచ్చు. బురద మట్టికి ఉండే స్వభావం కారణంగా శరీరానికి ఉపశమనం కలుగుతుంది.

Also read : Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ?

బురదలో స్నానం ఏంటి ?
మడ్ బాతింగ్ గురించి ఎప్పుడు విన్నా, చదివినా చాలా మందికి కలిగే తొలి సందేహం ఏంటంటే.. బురద అంటేనే అసహ్యించుకుంటాం కదా.. మరి అందులో స్నానం, ఆ స్నానంతో ప్రయోజనాలు ఏంటని. అయితే మడ్ బాతింగ్ అంటే ఏదో ఓ బురద ఉన్న చోటుకు వెళ్లి చేసేది కాదు అనే విషయాన్ని గుర్తించాలి. 

How to do mud bathing at home: ఇంట్లో ఉండే మడ్ బాతింగ్ ఎలా చేయాలి ?
మడ్ బాతింగ్ చేయాలనుకునేవారు శుభ్రమైన మట్టిని సేకరించి, ఆ మట్టిని నీటిలో కలిపి నానబెట్టండి. మట్టి బురదలా మారిన తర్వాత అప్పుడు శరీరంపై అప్లై చేసి 40-60 నిమిషాల తర్వాత నీటితో స్నానం చేయండి.

కొన్ని ఖరీదైన రిసార్ట్స్, బీచ్ లొకేషన్స్ లేదా గ్రామీణ నేపథ్యం ఉండి ఆయుర్వేద వైద్యం అందించే చోట ఈ మడ్ బాతింగ్ సేవలు (Mud bathing services) లభిస్తుంటాయి.

మొత్తానికి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మడ్ బాతింగ్‌తో పాటు దాంతో కలిగే ప్రయోజనాలను గుర్తుచేసిందన్నమాట. 

Also read: Black Fungus Symptoms: బ్లాక్ ఫంగస్‌ను ఎలా గుర్తించాలి..ఎవరికి ముప్పు ఎక్కువంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News