Cure Joint Pains with Guava Leaves in 3 Days: శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ సమస్యలు కూడా వస్తాయి. ఈ యాసిడ్‌ను నియంత్రించడానికి తప్పకుండా తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రెమెడీస్‌ను వినియోగించడం వల్ల కూడా సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం..తీవ్ర యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు జామ ఆకులను వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే జామ ఆకులను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకులతో యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చు..
జామ ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ లక్షణాలు యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ప్యూరిన్ జీవక్రియను వేగవంతం చేసి యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు జామ ఆకులను వినియోగించాల్సి ఉంటుంది.
జామ ఆకులను ఎలా వినియోగించాలో తెలుసా..
యూరిక్ యాసిడ్, గౌట్‌ను నియంత్రించడానికి జామ ఆకులతో టీని తాగాల్సి ఉంటుంది. జామ ఆకుల టీలో ఉండే గుణాలు గౌట్, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ ఆకుల డికాషన్ తాగిన సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ టీతో పాట కషాయం చేసుకుని తాగాల్సి ఉంటుంది..
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షల
Also read: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి షాక్.. కీలక ప్లేయర్ ఔట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook