Unknown Facts About Makar Sankranti: రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే క్రమంలో ఎంతో ఆనందంగా జరుపుకునే పండగే మకర సంక్రాంతి.. ఈ పండగను రైతుల ఆనందానికి చిహ్నంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లోని రైతులంతా ఈ పండగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే పది రోజుల ముందే ఈ పండగ ఎంతో వైభవంగా ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతికి ముందే వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే ఎద్దులకు శుభ్రమైన నీటితో స్నానం చేయించి.. పూలకు సాన పెట్టించి నూనె రాసి అందంగా తయారుచేస్తారు. ఈ ఎద్దులను అలంకరించి రైతులందరూ లక్ష్మీ దేవతగా భావిస్తారు. అంతేకాకుండా కనుమ పండుగ రోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.
కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరుగు పందాలు, ముగ్గుల పోటీలు, జానపద నృత్యాలు, గాలిపటాలను ఎగిరేయడాలు ఇలా వివిధ ఆచారాలు పాటిస్తారు. ప్రతి ఆచారానికి ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా తెలుగు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఆనందంగా గాలిపటాలనే ఎగరవేస్తారు. ఈ గాలిపటాలను ఎగురవేయడానికి వెనుక కూడా చాలా చరిత్ర ఉందని పూర్వీకులు తెలిపారు. మకర సంక్రాంతి రోజు నోటిని తీపి చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని పెద్దలు పిల్లలు కలిసి రంగురంగుల గాలిపటాలని ఎగురవేస్తూ ఉంటారు. అసలు గాలిపటాలని ఎగరవేయడానికి కారణాలేంటో తెలుసా.?
సంక్రాంతి సంబరాల్లో రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరవేయడం ఒక ప్రత్యేకత. అంతేకాకుండా వీటి ప్రాముఖ్యత తెలిసిన తర్వాత కొన్ని సంస్థలు అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తున్నాయి. అయితే సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈ పండగను సూర్య భగవానుడికి అంకితం చేస్తారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
సంక్రాంతి రోజు తెల్లవారి జామున ఆకాశంలో రంగురంగుల పతంగులను ఎగరవేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. చలికాలంలో వాతావరణం లోని తేమ ఒక్కసారిగా పెరిగిపోయి అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. అయితే సంక్రాంతి రోజు ప్రకాశంవంతమైన సూర్యకిరణాలను పొందడానికి ఆకాశంలో ఉదయాన్నే గాలిపటాలు ఎగరవేస్తారు.
ఇలా సంక్రాంతి పండగ రోజున ఉదయాన్నే గాలిపటాలు ఎగరవేయడం వల్ల వాతావరణంలోని ప్రకాశవంతమైన సూర్యకిరణాలు చేరి.. చలి కారణంగా వచ్చే జబ్బులు జ్వరం తగ్గే అవకాశాలు ఉన్నాయని ఒక నమ్మకం. అందుకే ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముందు, తర్వాత గాలిపటాలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి రాక ఎగరవేస్తూ ఎంతో ఆనందంగా పండగను జరుపుకుంటారు.
Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలుసా?