Hair care: తెల్ల జుట్టు ప్రస్తుతం ఎంతోమందిని బాధిస్తున్న ప్రధాన సమస్య. తెల్ల వెంట్రుకలని కవర్ చేయడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగిస్తాం. బాగా ధర ఎక్కువ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ పూర్తిగా కెమికల్స్ తో నిండి ఉంటాయి. ఎక్కువ ఇలాంటివి వాడడం వల్ల ఉన్న జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది.. అయితే ఇంటి వద్దనే సులభంగా.. ఎంతో నేచురల్ గా బంగాళాదుంప తొక్కని ఉపయోగించి మన అన్న తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం పదండి..
బంగాళాదుంప తొక్కల లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, రాగి, ఐరన్, జింక్ వంటివి అధికమవుతాదిలో ఉంటాయి. ఇవి మన జుట్టు కుదుళ్లను బలపరచడంతో పాటు త్వరగా తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి.
పైగా ఇది ఎంతో నేచురల్ పద్ధతి కాబట్టి మన జుట్టుకు ఎటువంటి హాని కలగదు. రెగ్యులర్ గా ఇది చేసే వాళ్ళకి జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా మృదువగా కూడా మారుతుంది.
ప్యాక్ తయారీ విధానం..
ఇందుకోసం ఒక ఆరు బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తొక్కను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్లలో వేసి బాగా ఉడికించి ఆ నీరు గంజి.. లాగా అయ్యేంతవరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి ఒక ఎయిర్ టైట్ స్ప్రే బాటిల్ లోకి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. తల స్నానం చేసిన తర్వాత ఈ లిక్విడ్ ను తలకు బాగా అప్లై చేసి బాగా మర్దన చేసుకోవాలి. ఒక అరగంట అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ఈ మిశ్రమం మీ జుట్టుకి పిగ్మెంటేషన్ ని అందిస్తుంది. దీంతో క్రమంగా తెల్ల జుట్టు నల్లబడుతుంది.
Also Read: Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.