Tri Colour Idli Recipe: జెండా కలర్స్‌లో రుచికరమైన ఇడ్లీ రెసిపీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..

Independence Day Special Idli Recipe: స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలు ఎక్కువగా త్రివర్ణ పతాకం రంగులతో కూడిన ఆహార పదార్థాలను చెయ్యమని అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు జెండా రంగులతో కూడిన ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో వివరించబోతున్నాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 13, 2024, 02:36 PM IST
Tri Colour Idli Recipe: జెండా కలర్స్‌లో రుచికరమైన ఇడ్లీ రెసిపీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..

Tri Colour Idli Recipe: ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెనా వీధి వీధినా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటుకుంటారు. ముఖ్యంగా ఈ దినోత్సవం పాఠశాలల్లోనైతే ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది. పిల్లలంతా ఉదయాన్నే కొత్త దుస్తులతో స్కూల్ కి చేరుకొని ఆటపాటల మధ్య స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లలకు ఈరోజు ఎంతో ప్రత్యేకమైనది కాబట్టి వారు తినే పదార్థాలు కూడా ప్రత్యేకమైనట్లుగానే తయారు చేయించుకుంటారు. కొంతమంది పిల్లలు అయితే త్రివర్ణ రంగులతో కూడిన ఆహార పదార్థాలను అంటే ఇష్టపడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీకోసం ఈరోజు జెండా రంగులతో కూడిన ఇడ్లీ రెసిపీ తయారీ విధానాన్ని అందించబోతున్నాం. దీనిని ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

త్రివర్ణ ఇడ్లీ రెసిపీకి అవసరమైన పదార్థాలు:
ఇడ్లీ బ్యాటర్ కోసం:

మినప పప్పు - 500 గ్రాములు
ఇడ్లీ రవ్వ - 1 కిలోగ్రాము
బేకింగ్ సోడా - 5 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపోతుంది

రంగుల కోసం:
క్యారెట్ ప్యూరీ - 50 గ్రాములు
పాలకూర ప్యూరీ - 50 గ్రాములు (ఉడికించి తీసిన )

తయారీ విధానం:
ఇడ్లీ బ్యాటర్ తయారీ:

ఈ రెసిపీని తయారు చేయడానికి ముందుగా మినప పప్పును, ఇడ్లీ రవ్వను విడిగా నానబెట్టుకోండి. మినప పప్పును 5-6 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు నానబెట్టాలి.
అదనపు నీటిని తీసివేసి, పప్పును కొద్దిగా వెట్ గ్రైండర్ లేదా బ్లెండర్‌లో మెత్తగా రుబ్బుకోండి.
అవసరమైతే నీళ్ళు కలిపి మృదువైన, మందపాటి బ్యాటర్‌గా రుబ్బుకోండి.
రవ్వ నుంచి అదనపు నీటిని తీసివేసి, పప్పు మిశ్రమంలో కలపండి. బాగా కలిపి, వెచ్చటి ప్రదేశంలో కొన్ని గంటలు పెరగడానికి వదిలివేయండి.

రంగుల తయారీ:
క్యారెట్‌ను చిన్న ముక్కలుగా కోసి, నీటిలో ఉడికించి, మెత్తగా మిక్సీ జార్‌లో రుబ్బుకోండి. ఇది ఆరెంజ్ రంగు ఇస్తుంది.
పాలకూరను శుభ్రం చేసి, వేయించి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్‌లో రుబ్బుకోండి. ఇది ఆకుపచ్చ రంగు ఇస్తుంది.
తెలుపు రంగు కోసం ఎలాంటి కూరగాయలను వినియోగించిన అక్కర్లేదు. పిండి తెలుపు రంగులోనే ఉంటుంది కాబట్టి ఈ రంగు రావడానికి ఎలాంటి కెమికల్ రంగులు వినియోగించవద్దు.

త్రివర్ణ ఇడ్లీలు తయారీ:
ఇడ్లీ బ్యాటర్‌ను సమాన భాగాలుగా లేదా విభజించి, ప్రతి భాగానికి క్యారెట్, పాలకూర బెండకాయ ప్యూరీని కలపండి.
ఇడ్లీ మిశ్రమాలను విడిగా ఇడ్లీ ప్లేట్లలో పోసి, ఆవిరి పెట్టిన ఇడ్లీ కుక్కర్‌లో ఉంచండి.
ఇలా 20 నుంచి 25 నిమిషాలు లేదా ఇడ్లీలు బాగా అయ్యే వరకు ఉడికించండి.
చల్లారిన తర్వాత ఇడ్లీలను తీసి, మీకు ఇష్టమైన చట్నీలతో సర్వ్ చేయండి.

గమనిక:
ఇడ్లీ బ్యాటర్ పెరుగుదలకు సరైన వాతావరణం అవసరం. వెచ్చటి ప్రదేశంలో ఉంచడం మంచిది.
ఇడ్లీలను మరింత రుచికరంగా చేయడానికి మీకు ఇష్టమైన సాంబార్, చట్నీలతో సర్వ్ చేయండి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News