Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి కలిగిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ రోజు మంచిదట

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ ఉద్యోగులకైనా.. వ్యాపారస్తులకైనా చాలా బాగుందని రాశి ఫలాలు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 9, గురువారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

Last Updated : Apr 9, 2020, 10:33 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి కలిగిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ రోజు మంచిదట

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ ఉద్యోగులకైనా.. వ్యాపారస్తులకైనా చాలా బాగుందని రాశి ఫలాలు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 9, గురువారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

ఏప్రిల్ 9, గురువారం నాటి మీ రాశి ఫలాలు 

మేష రాశి 9 ఏప్రిల్ 2020 ( మేష రాశి వారి జాతకం )
కొన్ని పనులకు అవాంతరాలు ఎదురవచ్చు. రోజుకంటే కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలు మారడానికి ఆసక్తి చూపుతారు, కానీ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులే ఎదురవుతాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. డబ్బు, పొదుపు విషయంలో ఇవాళ మీరు ఇతరుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. పెట్టుబడి లేదా ఖర్చుల గురించి కూడా ఇతరులతో చర్చించే అవకాశాలున్నాయి. మీ భాగస్వామికి ఇవాళ మానసిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి 9 ఏప్రిల్ 2020 ( వృషభ రాశి వారి జాతకం )
వృషభ రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో లాభం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండవచ్చు. కలిసి పనిచేసే చోట ఉద్యోగస్తులకు మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సహాయం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవివాహితులు తాము ప్రేమించిన వారికి తమ ప్రేమను తెలియజేయడానికి బాగుంటుంది. మీరు పని చేసే పద్ధతుల్లో మార్పు ఉండవచ్చు. తద్వారా మీరు ప్రయోజనం కూడా పొందుతారు. కెరీర్‌లో ముందుకు సాగడానికి మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.

మిథున రాశి 9 ఏప్రిల్ 2020 ( మిథున రాశి వారి జాతకం )
నక్షత్రాల స్థానం ఇవాళ మీకు అనుకూలించ వచ్చు. ఈ రోజు మీరు చాలా చురుకుగా కనిపిస్తారు.. చురుకుగా ఉంటారు. మీరు కొత్త ఉద్యోగం లేదా కొత్త బాధ్యత పొందవచ్చు. ఆగిపోయిన పనిని పూర్తి చేయవచ్చు. కొంతమంది కొత్త వ్యక్తులకు మీతో పరిచయం ఏర్పడవచ్చు. ప్రేమించిన వారి సహాయంతో, సంపద పొందే ప్రయోజనాలు ఉన్నాయి. సామాజిక, సామూహిక పనుల కోసం ప్రజలను కలుసుకోవచ్చు. మీరు రోజంతా తాజాదనంతో ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి 9 ఏప్రిల్ 2020  ( కర్కాటక రాశి వారి జాతకం )
ఈ రోజు మీరు మీ పనితీరుతో కొంతమందిని ఆకట్టుకుంటారు. మీరు ఉద్యోగాలు మార్చడం లేదా అదనపు ఆదాయాన్ని ఎలా పొందాలనే విషయమై ఆలోచించే అవకాశాలున్నాయి. ఈ విషయంలో మీకు కొంత అదృష్టం కూడా తోడవవచ్చు. ఏ విషయంలోనైనా కొత్తగా ఆరంభించే పనుల్లో విజయం కూడా సాధించవచ్చు. వివిధ కారణాలతో ఇదివరకు ఇరుక్కుపోయిన డబ్బులు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయోజనం చేకూరుతుంది. అలాగని అదృష్టంపైనే భారం వేసి శ్రమించడం మానేయొద్దు. ఎందుకంటే కష్టేఫలి అని అన్నారు మన పెద్దలు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరుగొచ్చు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కుటుంబంంలో ఆనందం , సంతృప్తి నెలకొంటుంది. ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే ప్రమాదం గోచరిస్తోంది. మీరు ఇవాళ ఎప్పటికన్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

సింహ రాశి 9 ఏప్రిల్ 2020 ( సింహ రాశి వారి జాతకం )
మీరు అధికారుల నుండి తక్కువ సహకారం పొందుతారు మరియు మీరు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారం లేదా ఏదైనా పనిని చేతిలో తీసుకుంటే, దానిలో విజయం సాధించే అవకాశం తక్కువ. వ్యాపార విషయాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోండి. తొందరపడకండి. ఒంటరితనం మానుకోండి అసంపూర్ణమైన పనితో వ్యవహరించడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు మీకు లభించే డబ్బును ప్రస్తుతానికి ఆదా చేయండి.

కన్యా రాశి 9 ఏప్రిల్ 2020 ( కన్యా రాశి వారి జాతకం )
వ్యాపారం, ఉద్యోగాల విషయంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా ప్రణాళికపరమైన ఆలోచనలు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఆదాయాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం ఎలా అనే అంశాలపై ఆలోచిస్తారు. ప్రణాళికలు రచించుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఏదో తెలియని బహుమతి పొందే అవకాశాలున్నాయి. ప్రేమికులకు తమ ప్రేమను వ్యక్తపర్చడానికి ఈ రోజు మంచిది కావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎవ్వరికైనా సరే వారు అడగనిదే అభిప్రాయాలు చెప్పకుండా ఉండాలి. మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కూడా కనిపించొచ్చు.

తులా రాశి 9 ఏప్రిల్ 2020 ( తులా రాశి వారి జాతకం )
పెండింగ్‌లో ఉంటూ వస్తున్న కొన్ని పనులు ఇవాళ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారంలో సకాలంలో సహకారం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. కొంతమంది మీ పని తీరుని వ్యతిరేకించవచ్చు. ఇది కాకుండా, మీరు కొత్తగా ఇంకేదైనా చేయాలని వారు మీ నుండి ఆశించవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో చేయాలనుకుంటున్న ఏవైనా పెద్ద పనులకు సంబంధించిన ముందస్తు ప్లానింగ్ చేసుకోవడానికి తులా రాశి వారికి ఇవాళ మంచి రోజు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి సహాయసహకారాలు లభిస్తాయి. వివాహితులకు ఈ రోజు మంచిది అని చెప్పవచ్చు.

వృశ్చిక రాశి 9 ఏప్రిల్ 2020 ( వృశ్చిక రాశి వారి జాతకం ) 
వ్యాపారంలో ప్రయోజనం కలుగుతుంది. కాకపోతే వ్యాపార నిర్ణయాలు తెలివిగా ఆలోచించి తీసుకోండి. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ రోజు బాగుంది. ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తోన్న పనులు పరిష్కరించుకోవడానికి ఇది మంచి రోజు. పాత సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. శత్రువులపై గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కొన్ని కొత్త బాధ్యతలు కూడా మీరు నిర్వహించాల్సి రావొచ్చు. కొన్ని మంచి అవకాశాలు ఎదురవుతాయి. ఇవాళ మీకు మీ భాగస్వామి నుండి సహాయసహకారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు రాశి 9 ఏప్రిల్ 2020 ( ధనుస్సు రాశి వారి జాతకం )
ఉపాధి చేసుకునే వారికి ఏవైనా అంతరాయాలు ఎదురుకావొచ్చు. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తలు మరీ అవసరం. వ్యర్థమైన పనిలో సమయం వృథా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయని మీ జాతకం గోచరిస్తోంది. ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మకర రాశి 9 ఏప్రిల్ 2020 ( మకర రాశి వారి జాతకం )
పాత ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అందుకే నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సరైన ప్రయత్నలోపం లేని ఏ పనిలోనైనా తప్పకుండా విజయం సాధిస్తారు. వ్యాపారం, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు చేయవచ్చు. మీ శక్తి రెట్టింపవుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. అనవసరంగా ఎంత ఎక్కువ మాట్లాడకపోతే అంత మంచింది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంది. అంతేకాకుండా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. నాటి నుంచి ఈ రోజు ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

కుంభ రాశి 9 ఏప్రిల్ 2020 ( కుంభ రాశి వారి జాతకం )
కుంభ రాశి వారికి ఈ రోజు కెరీర్‌కు మంచిదని చెప్పవచ్చు. మీరు పనిచేసేచోట ఇతరుల నుండి సహాయసహకారాలు పొందుతారు. కొన్ని మంచి, పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనం చేకురుతుంది. ఆస్తి విషయాలలో ఈ సమయం మంచిదని కూడా చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితానికి ఈ రోజు కూడా మంచిది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

మీన రాశి 9 ఏప్రిల్ 2020 ( మీన రాశి వారి జాతకం )
ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, అలాగని మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా అదృష్టంపైనే భారం వేసి శ్రమించకుండానే ఆ ప్రయోజనం వస్తే తీసుకుందాం అని అనుకోవద్దు. ఎందుకంటే కష్టపడనిదే ఏదీ రాదు... అలా వచ్చేది ఏది ఎక్కువ కాలం నిలవదు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. భాగస్వామి నుంచి కూడా మీకు సహాయం లభించినట్టయితే... ఆర్థికంగా మరింత ఎదుగొచ్చు. ఇతరుల వద్ద తీసుకున్న పాత రుణం తీరిపోవచ్చు. వ్యర్థ ఖర్చులను నియంత్రించవచ్చు. కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పని లేదా కొత్త బాధ్యత పొందవచ్చు. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. 

సర్వేజనా సుఖినోభవంతు.

Trending News