Blood Pressure: హై బ్లడ్ ప్రెజర్ సైలంట్ కిల్లర్. ప్రతిఏటా దాదాపు 10 మిలియన్ల ప్రజల ప్రాణాలను హరిస్తోంది. హైబీపీకి అనేక కారణాలున్నాయి. బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇతర అనారోగ్య కారణాలు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మంచి డైట్ ను ఫాలో అయితే హైబీపీని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ౩౦-79 వయస్సులవారు దాదాపు 1.28 బిలియన్స్ ఈ వ్యాధి బారిన పడుతున్నారట. హైబీపీని అదులో పెట్టాలంటే ఈ వైద్యుల సూచనలు మీరు ఫాలో అవ్వండి..
1. మన ఆరోగ్యకరమైన గుండెకు ఆహారంలో సోడియం, పొటాషియం ఎంతో అవసరం. ఇవి బ్లడ్ ప్రెజర్ ను సమతుల్యంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని అధికంగా తీసుకుంటే కూడా హైపర్ టెన్షన్ కు దారితీస్తుంది.
2. మనరోజువారీ ఆహారంలో సోడియం మోతాదు అధికంగా ఉండి, పొటాషియం తక్కువగా ఉంటే హైబీపీ, స్ట్రోక్, గుండె సమస్యలు కూడా వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
3. పొటాషియం సోడియానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అదనంగా ఉన్న సోడియాన్ని బయటకు పంపిస్తుంది. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అందుకే పొటాషియం సరైన మోతాదులో తీసుకుంటే హార్ట్ బీట్ కూడా సక్రమంగా సాగుతుంది.
4. రకరకాల పండ్లు కూరగాయల్లో పొటాషియం ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో సోడియం పొటాషియం రేషియో సక్రమంగా ఉండాలి.
5. అధికమోతాదులో పొటాషియం తీసుకోవడం కూడా కండరాల బలహీనత, హార్ట్ బీట్ లో మార్పులకు దారితీస్తుంది. సరైన మోతాదులో సోడియం, పొటాషియం రేషియో ఉండేలా చూసుకోవాలి.
Also Read: Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ మరోసారి ఎంప్లాయిస్ కు షాక్.. గేమింగ్ విభాగంలో భారీఎత్తున లేఆఫ్స్..
6. ముఖ్యంగా సోడియం క్లోరైడ్ కు బదులుగా పొటాషియం క్లోరైడ్ ను ఆహారంలో చేర్చుకుంటే సమస్య పరిష్కారమవుతుందట. అయితే, సోడియం తక్కువగా ఉన్న ఆహారం రుచి తక్కువగా ఉంటుందని వాటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే మన లైఫ్ స్టైల్ మార్చుకునే విధానం మనలోనే ఉంది. ఆహారంలో సోడియం తక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలు.. అరటిపండ్లు, ఆరెంజ్, ఆకుకూరలు, బంగాల దుంప.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook