Thyroid Stimulating Hormone: ప్రపంచ వ్యాప్తంగా థైరాయిడ్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యల బారిన పురుషుల కంటే మహిళలలే ఎక్కువ పడుతున్నారని పరిశోధనల్లో తెలింది. థైరాయిడ్ అనేది హార్మోన్ల అసమతుల్యత..ఈ లోపం కారణంగా ఆహారాల నుంచి వచ్చే శక్తిలో తీవ్ర సమస్యలు వస్తాయి. థైరాయిడ్ T3 అంటే ట్రైయోడోథైరోనిన్ అని..T4 అంటే థైరాక్సిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుందని వైద్యులు భావిస్తారు. ఈ హార్మోన్లు శ్వాస, జీర్ణక్రియ, శరీర ఉష్ణోగ్రత, ఎముకలు, కండరాలు, కొలెస్ట్రాల్, హృదయ స్పందనలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడాన్నే థైరాయిడ్ సమస్య అంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా మహిళల్లో వస్తాయి. అయితే ఈ సమస్య వచ్చే ముందు మీ శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు తప్పకుండా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ లక్షణాలు థైరాయిడ్‌కు దారి తీస్తాయి:
నిద్ర రాకపోవడం:
చాలా మంది మహిళ్లలో నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి. థైరాయిడ్ రావడానికి ముందు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. కొంతమంది మహిళల్లో గాఢనిద్ర రాకపోయి..థైరాయిడ్ వ్యాధి లక్షణంగా భావించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో నిద్రపోయిన ఉదయం నిద్రలేచిన తర్వాత అలసట వంటి సమస్యలు వస్తాయి. ఇది కూడా ఒక లక్షణమని నిపుణులు భావిస్తున్నారు.
తక్కువ లిబిడో:
తక్కువ లిబిడో అనేది ఒక రకమైన లైంగిక సమస్య. కొంతమంది మహిళలు సెక్స్ పట్ల కోరికలు కోల్పోతారు. ఇది కూడా హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల వస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ సులభంగా అలసిపోతారు. ఇలాంటి లక్షణాలు థైరాయిడ్‌కు దారి తీస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలసట, బలహీనత:
ప్రస్తుతం చాలా మందిలో పోషకాల లోపం కారణంగా కూడా అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ సమస్యలు కొందరిలో తరచుగా వస్తూ ఉంటాయి. ఇలా రావడం థైరాయిడ్ మొదటి లక్షణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి పనులు చేసేందుకు ఇష్టపడరు. అంతేకాకుండా పనులు చేసినప్పటికీ సులభంగా అలసిపోతారు.
ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?
థైరాయిడ్ సాధారణ లక్షణాలు:
బరువు పెరగడం
మతిమరుపు
బలహీనత
మలబద్ధకం
అలసట
పీరియడ్స్‌లో ఆటంకాలు
చలిని తట్టుకోలేకపోవడం
రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం
కండరాల నొప్పి
నెమ్మదిగా గుండె కొట్టుకోవడం
హైపోథైరాయిడ్ లక్షణాలు:
థైరాయిడ్ గ్రంధి పెరుగుదల
చంచలమైన అనుభూతి
ఒత్తిడి
బరువు తగ్గడం
కళ్లలో మంట
ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి