దీపావళి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

Last Updated : Oct 18, 2017, 12:23 PM IST
దీపావళి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

దీపావళి కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కొందరు సంబరాలు, టపాసులు కాల్చడానికి, మరికొందరు  తీపి వంటల రుచికోసం వేచి చూస్తుంటారు. కానీ వివిధ రకాల వంటకాలు తినాలని ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని మరిచిపోతారు.  అలా కాకుండా ఉండేందుకు, ఆరోగ్యంపై జాగ్రత్త వహించేందుకు మేము కొన్ని ప్రత్యేక విషయాలు చెబుతున్నాం ..  

1. రుచి చూస్తూ చిన్న తీపిముక్కను తినండి 

తీపి ఎవ్వరికైనా ఇష్టమే. చూస్తే నోరూరిపోతుంది.. అస్సలు ఆగము అది పండగ  లేక శుభకార్యమైనా సరే. ఇలాంటి సందర్భంలోనే కాస్త  కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువగా తిని కడుపు గందరగోళానికి గురయ్యే బదులు కాస్త తక్కువ మోతాదులో రుచిని ఆస్వాదించేట్లు తినాలి. పెద్ద పెద్దగా అలానే నోట్లో వేసుకోకుండా చిన్నచిన్న ముక్కలుగా చేసుకుంటూ తీపిని తినాలి. ఇలా చేయడంవల్ల మితిమీరిన ఆహారం నుంచి బయటపడతారు.

2. చిన్న పళ్లెంలో తినండి 

పెద్ద ప్లేట్ లలో ఆహారం ఎక్కువగా పడుతుంది. కడుపునిండా తిన్నాక అన్నం ఇంకా ఉంటే బలవంతంగా తినాల్సివస్తుంది. దాంతో ఉదర, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. కనుక చిన్న పళ్లెంలో కొద్దికొద్దిగా ఆహారం వడ్డించుకుంటూ తినాలి. ఇలా చేస్తే మనకు అవసరమైనంత ఆహారం కడుపునిండా తింటాము.  పండగపూట అన్ని కూరల రుచి ఆస్వాదించవచ్చు. 

3. నీరు తాగటం మర్చిపోవద్దు

ఏదేమైనా గానీ, నీరు తాగటం అస్సలు మరిచిపోవద్దు. మీలో ద్రవ స్థాయి మోతాదు మరింత పెంచుకోవాలంటే సదా నీరు బదులు అందులో నిమ్మ, పుదీనా కలుపుకొని తాగండి. శరీరంలో నీరు శాతం స్థిరంగా ఉండటానికి కీర, దోసకాయ కూడా ఉపయోగించవచ్చు. 

4. చక్కెర, ఉప్పు తినడం మానుకోండి

ఎక్కువ చక్కెర మరియు ఉప్పు తీసుకోవద్దు. వీలైనంత వరకు దూరంగా ఉంచండి. ఇది వాపు, స్థూలకాయం, ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. 

Trending News