అమ్మాయిలు పుడితే ఇంట్లో మహాలక్ష్మీ పుట్టింది అంటారు. పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు. కానీ అదే సమయంలో కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
రెండు రాశులలో జన్మించిన యువతులు పుట్టింటితో పాటు అత్తవారింట సైతం సిరిసంపదలు వచ్చేందుకు కారణం అవుతారని తెలుసా. 12 రాశులలోనూ తుల రాశి మరియు వృషభరాశులలో జన్మించిన అమ్మాయిలు చాలా లక్కీ. వాళ్లు కాళ్లు పెట్టిన అత్తవారిల్లు సైతం సంపద, సంతోషాలతో ఉంటాయని విశ్వసిస్తారు. ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడు. తుల, వృషభరాశుల అమ్మాయిల వల్ల కలిగే ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా
తుల(Libra): ఈ రాశిలో జన్మించిన ఆడవారు చాలా అదృష్టవంతులు. తులారాశి(Libra)లో జన్మించిన బాలికలు శుక్రుని ప్రభావం కలిగి ఉంటారు. అదేవిధంగా తులరాశిలో పుట్టిన అమ్మాయిలు నిరుపేద వారిని వివాహం చేసుకున్నప్పటికీ, వీరికి ఉన్న అదృష్టం కారణంగా అత్తవారింలో సిరిసంపదలు వస్తాయి. ఒక్కో మెట్టు ఎదుగుతూ డబ్బులు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్త్రీ మూల ప్రభావంతో భర్త చేపట్టే పనులు విజయవంతమై ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి.
చాలా వరకు తుల రాశిలో జన్మించిన బాలికలు చాలా తెలివైనవారిగా ఉంటారు. ప్రతి విషయాన్ని అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందుతారు. ప్రతి విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చేసుకుంటారు. అదే సమయంలో వీరికి ఆభరణాలంటే మిక్కిలి మక్కువ కలిగి ఉంటారు. అయితే ఐశ్వర్యాన్ని పొందుతారు కనుక కాస్త ఆలస్యంగానైనా వీరి కోరిక తీరుతుంది. ఈ రాశిలో పుట్టిన బాలికలు అద్భుతమైన కళాకారులుగా ఎదిగేందుకు అవకాశం ఉంది. శుక్రుడి ప్రభావం వీరికి సానుకూల శక్తిని అందిస్తుంది. కనుక ఈ రాశి ఆడవారిని వివాహం చేసుకోవడంతో అత్తవారింట అదృష్టం కలగనుంది.
Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే
వృషభ రాశి(Taurus Zodiac)లో జన్మించిన బాలికలకు అంతా మేలు జరుగుతుంది. వీరికి సైతం శుక్రుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీంతో బాలికలుగా ఉన్న సమయంలో తమ తండ్రికి, వివాహం అనంతరం భర్త ఇంటికి అదృష్టాన్ని తెస్తారు. కొన్ని సందర్భాలలో ఈ రాశిలో అమ్మాయి జన్మించిన సమయం నుంచి లాభాలు చేకూరతాయి. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సైతం ఉంటారు. వారిని వివాహం చేసుకోవడం అంటే లక్ష్మీ దేవతను ఒక ఇంటి నుండి అత్తవారింటికి పంపించడమే. వారిని వివాహం చేసుకున్న పురుషులు సైతం అదృష్టవంతులు అవుతారు.
వీరు పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులను, మెట్టినింటికి వెళ్లాక భర్త, అత్తామామలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వీరికి సైతం అందరి ప్రేమ, ఆప్యాయత దొరుకుతుంది. వీరు ఎట్టిపరిస్థితుల్లోనూ తన అనుకున్న వారిని ఒంటరిగా విడిచిపెట్టరు. భార్య చేసుకున్న పుణ్యం, ఆమె అదృష్ట కారణంగా అత్తవారింట సిరిసంపదలు, సుఖశాంతులు వర్ధిల్లుతాయని విశ్వసిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook