Weight Loss Drink: ఉదయాన్నే ఈ Homemade Drinks తాగితే బరువు తగ్గుతారట..!

Weight Loss Drink: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం తదితర కారణాల వల్ల బరువు ఎక్కువగా పెరుగుతున్నారు. అలాంటి వారు సులువుగా వైట్ లాస్ అయ్యే డ్రింక్స్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 09:16 AM IST
Weight Loss Drink: ఉదయాన్నే ఈ Homemade Drinks తాగితే బరువు తగ్గుతారట..!

Weight Loss Drinks: మనలో చాలా మంది బరువు తగ్గాలనుకుంటారు. కానీ దాని కోసం తగిన వ్యాయామం చేయడం కానీ, సరైన ఆహారం తినడం కానీ చేయరు. ఈ బిజీ లైఫ్ లో సులభంగా వైట్ లాస్ అవ్వాలనుకుంటారు. అయితే వీటి కోసం కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇవీ మీ బరువు తగ్గించడంలో ద్బుతంగా పనిచేస్తాయి. వాటిపై మీరు ఓ లుక్కేయండి మరి..

హెర్బల్ డిటాక్స్ టీ:
ఉదయాన్నే ఒక కప్పు హెర్బల్ డిటాక్స్ టీ తాగడం వల్ల మీ బరువు తగ్గుతుంది. ఈ టీలో డాండెలైన్, అల్లం మరియు లికోరైస్ రూట్ వంటి మూలికల మిశ్రమం ఉంటుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  

ఎల్లో వాటర్:
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. పసుపు నీరు తాగడం వల్ల మీ శరీరంలోని మంటను తగ్గించడమే కాకుండా మీ బరువును కూడా లాస్ చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు పొడి మరియు కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపి పరగడుపునే తాగండి. 

నిమ్మరసం:
నిమ్మరసం తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పెక్టిన్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి అజీర్ణం తగ్గుతుంది.

Also Read: Kidney Damage: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News