ప్రతిరోజూ ఉదయం, తిరిగి సాయంత్రం వేళ లేదా మధ్యలో రిలాక్సేషన్ కోసం ఇలా టీ తాగడం చాలామంది ఇష్టపడతారు. కొందరు టీతో ఏదో ఒక కాంబినేషన్ తీసుకుంటారు. కానీ టీతో కొన్నిరకాల కాంబినేషన్ మంచిది కాదంటున్నారు..
కొంతమంది టీతో కొన్ని రకాల పదార్ధాల్ని తెలియక తీసుకుంటారు. కొన్ని రకాల పదార్ధాల్ని టీతో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఆ పదార్ధాలు ఏంటనేది తెలుసుకోవాలి. టీతో ఎటువంటి పదార్ధాల్ని కలిపి తీసుకోకూడదో చూద్దాం.
1. టీతో ఎప్పుడూ చల్లటి పదార్ధాల్ని కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా సోడా, కూల్ డ్రింక్ వంటివి టీతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణక్రియ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
2. టీతో ఎప్పుడూ పసుపు తీసుకోకూడదు. వాస్తవానికి పసుపులో లిక్విడ్ ఎలిమెంట్ ఉండటం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది.
3. టీతో ఎప్పుడూ పులుపు పదార్ధాల్ని కలిపి తీసుకోకూడదు. ప్రత్యేకించి నిమ్మకాయ వంటివి. ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
4. కొంతమంది టీతో పకోడీలు తింటారు. ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే పకోడీలో ఉండే శెనగపిండి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది.
5. టీతో ఎప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు తీసుకోకూడదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
6. టీతో పచ్చి పదార్ధాలైన సలాడ్, బాయిల్డ్ ఎగ్, స్ప్రౌట్స్, ధాన్యాలు వంటివి తినకూడదు. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి.
Also read: Cloves Benefits: లవంగం పరిమితి దాటితే మగవారిలో ఆ సమస్య వస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook