Tan Removal Mask At Home: వేసవి కాలం కారణంగా చాలా మందిలో చర్మం టానింగ్ లేదా నలుపు రంగుకు గురవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులు వడదెబ్బ ఇతర సమస్యలను కూడా ఎదుర్కోంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శనగ పిండిని మూఖానికి వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా టానింగ్, చిన్న చిన్న మచ్చలు, మొటిమలు, ఆయిల్ స్కిన్ సమస్యలు కూడా దూరమవుతాయని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో సహజమైన గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అయితే శనగ పిండి టానింగ్ రిమూవల్ మాస్క్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టానింగ్ రిమూవల్ మాస్క్‌ను తయారుచేయడానికి కావలసిన పదార్థాలు:
2 చెంచాలు రోజ్ వాటర్
2 చెంచాలు పెరుగు
2 చెంచాలు శనగపిండి
ఇది కూడా చదవండి: Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం!
ఈ మాస్క్ తయారు చేసే పద్ధతి:
శనగ పిండి టానింగ్ రిమూవల్ మాస్క్ చేయడానికి..ముందుగా చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో 2 చెంచాల శెనగపిండితో పాటు 2 చెంచాల పెరుగు, 2 చెంచాల రోజ్ వాటర్‌ను వేయాల్సి ఉంటుంది.
ఇలా మిశ్రమంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
అంతే సులభంగా టానింగ్ రిమూవల్ మాస్క్ సిద్ధం అయినట్లే..
అప్లై చేసే పద్ధతి:
ముందుగా మూఖాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ వేళ్ల సహాయంతో ఈ మాస్క్‌ని మీ మూఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని మెడపై కూడా అప్లై చేయండి.
ఇలా అప్లై చేసిన తర్వాత బాగా ఆరనివ్వండి.
తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి: Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook