Swimming Benefits: స్విమ్మింగ్‌తో కేవలం పది రోజుల్లోనే స్థూలకాయానికి చెక్, ఎన్ని కేలరీలు కరుగుతాయి

Swimming Benefits: బరువు తగ్గేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుంటారు కదా. ఇప్పుడు అసలైన ప్రయత్నం స్విమ్మింగ్ ప్రయత్నించి చూడండి. ఎంత వేగంగా బరువు తగ్గుతారో మీరు ఊహించలేరు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2022, 06:43 PM IST
Swimming Benefits: స్విమ్మింగ్‌తో కేవలం పది రోజుల్లోనే స్థూలకాయానికి చెక్, ఎన్ని కేలరీలు కరుగుతాయి

Swimming Benefits: బరువు తగ్గేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసుంటారు కదా. ఇప్పుడు అసలైన ప్రయత్నం స్విమ్మింగ్ ప్రయత్నించి చూడండి. ఎంత వేగంగా బరువు తగ్గుతారో మీరు ఊహించలేరు..

బరువు తగ్గేందుకు, స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు డైటింగ్, వాకింగ్, యోగా, ఎక్సర్‌సైజ్, జిమ్‌లో వర్కవుట్స్ ఇలా చాలా ప్రయత్నాలు చేసుంటారు. అన్నింటా విఫలమయ్యారా..అయితే ఇప్పుడు స్విమ్మింగ్ ప్రయత్నించండి..అద్భుత ప్రయోజనాలుంటాయి. స్విమ్మింగ్ వల్ల కేలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి. స్విమ్మింగ్ అనేది కేలరీలు బర్న్ చేయడమే కాకుండా..ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ రిలీజ్ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

మీకు రన్నింగ్ లేదా వాకింగ్‌పై పెద్దగా ఆసక్తి లేకపోతే..వెంటనే స్విమ్మింగ్ ప్రారంభించండి. ఎందుకంటే స్విమ్మింగ్‌లో శరీరంలోని అన్ని కండరాలు సమానంగా పనిచేస్తూ మొత్తం బాడీకు ఎక్సర్‌సైజ్ అవుతుంది. అంటే ఫుల్ బాడీ వర్కవుట్ సాధ్యమయ్యేది కేవలం స్విమ్మింగ్‌తోనేనని చాలామంది అభిప్రాయంగా ఉంది. 

స్విమ్మింగ్‌తో ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయి..

రోజుకు కేవలం ఒక గంట స్విమ్మింగ్ చేయడం వల్ల ఏకంగా 4 వందల కేలరీలు బర్న్ అవుతాయి. స్విమ్మింగ్ అనేది మంచి కార్డియోవాస్క్యులర్ యాక్టివిటీగా చెప్పవచ్చు. అదే సమయంలో హార్ట్ మజిల్స్‌ను బలోపేతం చేస్తుంది. విమెన్స్ హెల్త్ మేగజీన్‌లో ప్రస్తావించిన వివరాల ప్రకారం..మొత్తం శరీరానికి రక్త సరఫరా పూర్తిగా ఉండేందుకు సహకరిస్తుంది. 

స్విమ్మింగ్ ఉపయోగాలు

మీ రోజువారీ వర్కవుట్‌లో స్విమ్మింగ్ భాగంగా చేసుకోవాలి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం పెరుగుతుంది. బోన్ మాస్ అనేది మెరుగౌతుంది. ఎలుకలపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం..బోన్ మినరల్ డెన్సిటీ వృద్ధి చెందుతుంది. స్విమ్మింగ్ అనేది సమయాన్ని వెనక్కి కూడా నెడుతుందంటారు. అంటే స్విమ్మింగ్ చేయడం వల్ల ఉన్న వయస్సు కంటే యౌవ్వనంగా కన్పిస్తారు. కార్డియో వాస్క్యులర్ పనితీరును మెరుగుపరుస్తుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ వృద్ధి చెందుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో స్విమ్మింగ్ అద్భుతంగా పనిచేస్తుంది. 

స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మొత్తం శరీరం పూర్తిగా వర్క్ అవుతుంది. అద్భుతమైన ఎక్సర్‌సైజ్ కావడంతో రాత్రి నిద్ర సుఖంగా ఉంటుంది. అందుకే రెగ్యులర్ స్విమ్మర్లకు నిద్ర సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. స్విమ్మింగ్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను రెగ్యులేట్ చేస్తుంది. రక్తపోటును తగ్గించడమే కాకుండా..కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది. స్విమ్మింగ్ అనేది డయాబెటిస్, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుంది.

Also read: Weight loss Tips: ఈ విత్తనాలు మీ డైట్‌లో చేరిస్తే వారం రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News