Swimming Benefits: రోజుకో గంట స్విమ్మింగ్, 10 రోజుల్లో స్థూలకాయం మాయం

Swimming Benefits: ఆధునిక జీవనశైలిలో ఎదురౌతున్న ప్రధాన సమస్య స్థూలకాయం. స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసుంటారు కదా. ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి. కచ్చితంగా ఫలితాలుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 11:31 PM IST
Swimming Benefits: రోజుకో గంట స్విమ్మింగ్, 10 రోజుల్లో స్థూలకాయం మాయం

అధిక బరువు లేదా స్థూలకాయం సమస్య నుంచి గట్టెక్కేందుకు వ్యాయామం, డైటింగ్ ఇలా చాలానే పాటిస్తుంటారు. కానీ స్విమ్మింగ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. నిజమే..బరువు తగ్గేందుకు స్విమ్మింగ్‌కు మించిన వ్యాయామం మరొకటి లేనే లేదు.

అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు లేదా స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు డైటింగ్, వాకింగ్, యోగా, ఎక్సర్‌సైజ్, జిమ్‌లో వర్కవుట్స్ ఇలా చాలా ప్రయత్నాలు చేసుంటారు. అన్నింటా విఫలమయ్యారా. ఒక్కసారి స్విమ్మింగ్ ప్రయత్నించి చూస్తే చాలు..అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. స్విమ్మింగ్ వల్ల శరీరంలో కేలరీలు చాలా వేగంగా బర్న్ అవుతాయి. స్విమ్మింగ్ అనేది కేలరీలు బర్న్ చేయడమే కాకుండా..బాడీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ రిలీజ్ కోసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

అధిక బరువు సమస్యకు రన్నింగ్ లేదా వాకింగ్‌‌తో ప్రయోజనం కన్పించకపోతే..వెంటనే స్విమ్మింగ్ ప్రారంభించండి. ఎందుకంటే స్విమ్మింగ్‌లో శరీరంలోని అన్ని కండరాలు సమానంగా పనిచేస్తూ మొత్తం బాడీకు ఎక్సర్‌సైజ్ అవుతుంది. అంటే ఫుల్ బాడీ వర్కవుట్ సాధ్యమయ్యేది కేవలం స్విమ్మింగ్‌తోనేనని జిమ్ ట్రైనర్ల అభిప్రాయం.

స్విమ్మింగ్‌తో ప్రయోజనాలు

ప్రతిరోజూ ఒక గంట స్విమ్మింగ్ చేయడం వల్ల ఏకంగా 4 వందల కేలరీలు బర్న్అవుతాయని అంచనా. గుండె ఆరోగ్యానికి కూడా స్విమ్మింగ్ చాలా మంచిది. దీనిని మంచి కార్డియోవాస్క్యులర్ యాక్టివిటీగా చెప్పవచ్చు. స్విమ్మింగ్ హార్ట్ మజిల్స్‌ను బలోపేతం చేస్తుంది. 

స్విమ్మింగ్‌ను రోజువారీ వర్కవుట్‌లో భాగంగా చేసుకోవాలి. స్విమ్మింగ్ చేయడం వల్ల లంగ్స్ సామర్ధ్యం పెరుగుతుంది. బోన్ మాస్ మెరుగుపడుతుంది. ఎలుకలపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం..బోన్ మినరల్ డెన్సిటీ వృద్ధి చెందుతుంది. స్విమ్మింగ్ అనేది సమయాన్ని వెనక్కి కూడా నెడుతుందంటారు ఆరోగ్య నిపుణులు. అంటే స్విమ్మింగ్ చేయడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొలగి.. యౌవ్వనంగా కన్పిస్తారు. కేంద్ర నాడీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో స్విమ్మింగ్ అద్భుతమై ప్రక్రియగా పనిచేస్తుంది. 

స్విమ్మింగ్ అనేది మొత్తం శరీరానికి కావల్సిన వర్కవుట్ అందిస్తుంది. పూర్తిస్థాయి వ్యాయామం కావడంతో రాత్రి సుఖమైన నిద్ర పడుతుంది. స్విమ్మింగ్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గించడమే కాకుండా..కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది. 

Also read: Amla Benefits: చలికాలంలో క్షీణించే రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News