Summer Drinks: వేసవిలో మీ ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి చాలు

Summer Drinks to Reduce Body Heat: ఎండా కాలంలో ఒంట్లో వేడి పెరగడం కామన్. ఈ వేడిని తగ్గించుకోకపోతే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీ వేడిని తగ్గించే 5 డ్రింక్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 11:37 AM IST
Summer Drinks: వేసవిలో మీ ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి చాలు

Drinks for Summer: వేసవి స్టార్ట్ అయింది. ఉదయం 07 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మెుదలపెట్టాడు. దీని కారణంగా చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. అంతేకాకుండా డ్రీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. శరీరంలో నీటి కొరతను నివారించాలన్నా, అలసటకు గురికాకుండా ఉండాలన్నా, బాడీ వేడెక్కకూడదన్న కొన్ని డ్రింక్స్ తీసుకోవడం అవసరం. వేసవిలో మిమ్మల్ని చల్లబరిచే 5 డ్రింక్స్ గురించి చెలుసుకుందాం.

ఒంట్లో వేడి తగ్గాలంటే ఇవి తాగండి

నిమ్మరసం 
నిమ్మరసం ఒక క్లాసిక్ సమ్మర్ డ్రింక్. ఇది తయారు చేయడం సులభం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి వెంటనే రిఫ్రెష్‌మెంట్ ఇస్తుంది. 

పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయ నీటితో నిండిన పండు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వేడిని తగ్గించడంలో, వ్యాధుల నుంచి రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

కొబ్బరి నీరు
కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఇందులో కేలరీలు తక్కువ, పోటాషియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా లభిస్తాయి. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. 

Also Read: Guava Health benefits: జామ పండు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

మ్యాంగో డ్రింక్
ఆమ్ పన్నా అనేది పచ్చి మామిడి పండ్లతో తయారు చేయబడిన ఫేమస్ సమ్మర్ డ్రింక్. ఇందులో విటమిన్ సి ఎక్కువ కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మజ్జిగ
మనం వంటింట్లో ఎప్పుడూ ఉండే పానీయం మజ్జిగ. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కాల్షియం, పొటాషియం మరియు విటమిన్ B12 వంటి మూలకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కేలరీలు తక్కువ మెుత్తంలో ఉంటాయి. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Things To Do And Avoid After Intercourse: శృంగారంలో పాల్గొన్న తరువాత ఏం చేయాలి, ఏం చేయొద్దు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News