Summer Cooling Detox Drinks: మండే ఎండలకు కొన్ని రకాల జ్యూసులు డైట్లో చేర్చుకుంటే శరీరం చల్లగా ఉండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గిపోవచ్చు. ఇవి మన శరీరాన్ని డిటాక్సిఫై చేసి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తాయి. ఆ కూలింగ్ డిటాక్స్ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.
జీలకర్ర నీరు..
జీలకర్ర నీటిని జీరా వాటర్ అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు ఈ నీరు కడుపున శుభ్రం చేస్తుంది. మంచి జీర్ణ ఆరోగ్యానికి జీలకర్ర ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా బోవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికి ఇది ఎఫేక్టివ్ రెమిడీ.
ఉసిరి రసం..
ఉదయం లేచిన వెంటనే పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల బూస్ట్ అవుతుంది. ఇది ఫ్యాట్ బర్నింగ్ కూడా ఉపయోగపడుతుంది ఇందులో ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి డిన్నర్ చేసే ముందు ఒక గ్లాసు ఆమ్లా చూస్తే తాగడం వల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు .ఫైబర్ పుష్కలంగా ఉంటుంది మలబద్ధకం అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. ఉసిరి రసంతో బరువు కూడా తగ్గిపోతారు.
ఇదీ చదవండి: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?
తేనే, నిమ్మరసం..
తేనే, నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కడుపులో నుంచి విష పదార్థాలను బయటకు పంపడానికి సైతం తేనె నిమ్మరసం బయటికి పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కడుపులోని విషాన్ని తరమడానికి హనీ, తేనే సమర్థవంతంగా పనిచేస్తుంది.
దాల్చిని వాటర్
దాల్చిన చెక్కను పొడిని పొడిచేసుకుని తయారు చేస్తారు. ఉదయం ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలుపుకొని చెక్క పొడిని తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి బాగుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంతో బరువు తగ్గుతారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దాల్చిన చెక్క వాటర్ తీసుకోవచ్చు. ఇది నేచురల్ ఇన్సులిన్ లా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్
మెంతుల వాటర్..
మెంతులను నానబెట్టి తయారు చేసే నీరు కూడా ఆరోగ్యకరం. ఉదయం పరగడుపున ఈ మెంతులు నానబెట్టిన తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది శరీరం మెటబాలిజం రేటును కూడా బూస్టింగ్ ఇస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook