హిందూమతంలో పాముల్ని దేవతలుగా కొలుస్తారు. ఓ వైపు కొలుస్తూనే మరోవైపు కన్పిస్తే భయపడి పారిపోతాం. చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. అలాంటి పాముల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..
భూమ్మీద మానవాళితో పాటు జీవించే అతి ప్రమాదకరమైన జీవి పాము. పాముకుండే రెప్పపాటు వేగం, విషమే మనిషి భయానికి కారణం. అందుకే పామును చూస్తే చాలు ఒళ్లు జలదరించడం, భయంతో పారిపోవడం జరుగుతుంటుంది. అయితే పాములు ఇళ్లలోకి చొరబడేందుకు ముఖ్యంగా ఆరు కారణాలున్నాయంటున్నారు నిపుణులు.
పాములు ఇళ్లలోకి ఎందుకొస్తుంటాయి
ఇతర జంతువుల్లో లేనిది పాముల్లో మాత్రమే కన్పించేది చర్మాన్ని విడిచే ప్రక్రియ. పాములు సీజన్ ప్రకారం పాత చర్మాన్ని వదిలేస్తుంటాయి. పాములు పాత చర్మాన్ని విడిచేటప్పుడు సపోర్ట్ కోసం రాళ్లు, కాంక్రీటు, కలప వంటివి అవసరమౌతాయి. ఆ ఆసరాను వెతుక్కుంటూ ఇళ్లవైపుకు వస్తాయి.
పాములకు ఆహారం లభించకపోవడం కూడా ప్రధాన కారణం. పర్యావరణ చట్రంలో పాములు కూడా భాగమే. పంటపొలాల్లో తెగుళ్లను తినేది పాములే. సరీశృపాల ఆహారం కోసం కూడా ఇళ్లవైపుకు వస్తుంటాయి. ఇళ్లలో ఉండే ఎలుకలు, బయట ఉండే కప్పలు, బల్లులు, పక్షుల కోసం వస్తుంటాయి.
పాములు కోల్డ్ బ్లడెట్ జీవులు కావడంతో వెచ్చదనం కోసం చూస్తుంటాయి. శరీర ఉష్ణోగ్రతను తట్టుకోలేక వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి
ఇళ్లలోకి ఎలాగైనా చొరబడగలవు. తలుపులు, కిటికీలు, గోడల బీటలు, చిన్న చిన్న రంధ్రాల్లోంచి పాములు చొచ్చుకొచ్చేస్తాయి.
పాములు చిన్న సందు దొరికినా చేరిపోతుంటాయి. ఇంటి ప్రదేశాల్ని ఎవరూ గుర్తించలేరన్నట్టుగా భావించి ఇళ్లలో మూలల్లో చేరిపోతుంటాయి. సీజన్ మారినప్పడు పాములు నిద్రాణ స్థితిలో చేరుతుంటాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాస్త నిర్మాణుష్యంగా, పొదలు, చెట్లు ఉండే ప్రదేశాల్లో, ఇరుకుగా ఉండే గుడిసెల్లో పాములు ఎక్కువగా చేరే అవకాశాలున్నాయి.
Also read: Skin Care Tips: శెనగపిండితో ఇలా చేస్తే..15 రోజుల్లోనే అందమైన ముఖం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook