Facial Beauty Tips: నేచురల్ గ్లోతో ముఖం నిగనిగలాడాలంటే..ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Facial Beauty Tips: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లతో అద్భుత ప్రయోజనాలుంటాయి. పోషక విలువలతో నిండి ఉండే పండ్లు కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరిరక్షణలో సైతం అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటిదే ఈ ఫేస్ మాస్క్. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2023, 08:35 PM IST
Facial Beauty Tips: నేచురల్ గ్లోతో ముఖం నిగనిగలాడాలంటే..ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

Facial Beauty Tips: ఇటీవలి కాలంలో బ్యూటీ కేర్‌పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. అందంగా ఉండాలని, ముఖం కళకళలాడుతుండాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలో మార్కెట్‌లో లభించే వివిధ రకాల క్రీమ్స్ వినియోగిస్తుంటారు. కానీ ఇది మంచి అలవాటు కానే కాదు. ప్రకృతిలో లభించే కొన్ని పండ్లతో ముఖ సౌందర్యం అద్బుతంగా మెరుగుపర్చుకోవచ్చు.

సహజసిద్ధ పద్దతిలో ముఖ సౌందర్యం పెంచుకునేందుకు పైనాపిల్ ఫేస్ మాస్క్ కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ మాస్క్‌తో ముఖంపై నల్ల మచ్చలు, ముడతలు అన్నీ తొలగిపోతాయి. చర్మానికి కొత్తగా నిగారింపు వస్తుంది. ఇది పైనాపిల్ ఫేస్ మాస్క్ కావడంతో ఏ విధమైన దుష్పరిణామాలుండవు. మార్కెట్‌లో లభించే కెమికల్ ఆధారిత క్రీమ్స్‌తో ఆశించిన ప్రయోజనాలుండవు సరికదా..సైడ్ ఎఫెక్ట్స్ కూడా చుట్టుముడుతుంటాయి. పైనాపిల్‌లో విటమిన్ బి, విటమిన్ సి, కాపర్, మాంగనీస్, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి పోషకాలుంటాయి.  పైనాపిల్ ఫేస్ మాస్క్‌తో ముఖంపై మచ్చలు, ముడతలు అన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ముఖానికి సహజసిద్ధమైన నిగారింపు వచ్చి చేరుతుంది. 

పైనాపిల్ ఫేస్ మాస్క్ తయారు చేసేందుకు 2 స్పూన్ల పైనాపిల్ గుజ్జుతో పాటు 4 స్పూన్ల పాలు అవసరమౌతాయి. ముందుగా పైనాపిల్ ఒల్చుుకని అందులో గుజ్జుని మిక్సీలో వేసి పాలు కలిపి బ్లెండ్ చేసుకోవాలి. అంతే మీక్కావల్సిన పైనాపిల్ ఫేస్ మాస్క్ తయారైనట్టే. 

పైనాపిల్ ఫేస్ మాస్క్ రాసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు పైనాపిల్ ఫేస్ మాస్క్ రాసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే చాలా త్వరగా ముడతలు తొలగి ముఖం అందంగా నిగనిగలాడుతుంది.

Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News