Red Sandal Benefits: ఆరోగ్యంతో పాటు అందం కూడా ముఖ్యం. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం కూడా. మరి ముఖంపై పింపుల్స్ మీ అందాన్ని పాడు చేస్తున్నాయని బాధపడుతున్నారా..ఆ లేపనం ఎలా అప్లై చేస్తే చాలు..పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాలతో అద్భుతమైన ఔషధ గుణాలు పొందవచ్చు. ఆరోగ్య సమస్యలకే కాదు..అందానికి కూడా మెరుగులు దిద్దుకోవచ్చు. అందులో ముఖ్యమైంది ఎర్ర చందనం. ముఖంపై తరచూ పింపుల్స్ ఏర్పడి మీ అందాన్ని పాడుచేస్తున్నాయనే ఆందోళన వద్దిక. ఎర్ర చందనం లేపనం రాస్తే పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎర్ర చందనంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో చర్మంపై మచ్చలు, మరకలు, పింపుల్స్ వంటి చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు మీ చర్మానికి నిగారింపు కూడా వస్తుంది. ఎర్ర చందనం లేపనంతో కలిగే లాభాలేంటో చూద్దాం..
ఎర్ర చందనం వాడే విధానం
ఎర్ర చందనం ముక్కను కొద్ది నీళ్లలో అరగదీసి లేపనం తయారు చేసుకోవాలి. ఈ లేపనాన్ని ముఖంపై పింపుల్స్ ఉన్న చోట రాయాలి. ఓ 20 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే సమస్యలన్నీ దూరమౌతాయి. పింపుల్స్ ఉన్నచోట నొప్పులు లేదా వాపు ఉంటే తొలగిపోతుంది. పింపుల్స్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఎర్ర చందనం పౌడర్ లో కాస్త పసుపు కలుపుని పింపుల్స్ కు రాయాలి. దీనివల్ల పింపుల్స్ తగ్గిపోతాయి. అదే సమయంలో ఎర్ర చందనం పౌడర్‌లో నిమ్మరసం కొద్దిగా, కర్పూరం కొద్దిగా కలిపి రాస్తే ఇంకా అద్భుత ప్రయోజనాలుంటాయి. ఆ స్థానంలో దురద ఉంటే అది కూడా తగ్గుతుంది.
ఎర్ర చందనం పౌడర్‌తో కొబ్బరి నూనె కలిపి రాసినా పింపుల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పింపుల్స్ సమస్య పోవాలంటే 2-4 గ్రాముల చందనం పౌడర్ నీళ్లలో కలిపి తాగవచ్చు కూడా. ఎర్ర చందనం పౌడర్‌గా చేసుకుని..అందులో వేపాకులు, రోజ్ వాటర్‌తో పేస్ట్ తయారు చేసుకుని ముఖానికి రాసుకుంటే..పింపుల్స్ దూరమౌతాయి. మరోవైపు ముఖం వర్ఛస్సు పెరుగుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది.
Also read: Disadvantages Of Salad: పుట్టగొడుగు, క్యాబేజీ, బ్రోకలీలను ఉడికించకుండా తింటే ఏం జరుగుతుందో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.