ఎవరు ఎప్పుడు మరణిస్తారనేది చెప్పడం కష్టం. ఎవరికీ తెలియదు కూడా. ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉండేవాళ్లు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపధ్యంలో మరణానికి ముందు కొన్ని సంకేతాలుంటాయని తెలుస్తోంది. ఆ లక్షణాల్ని గుర్తు పట్టగలిగితే ఎప్పుడు మరణమనేది తెలిసిపోతుంది.
మరణం ఎప్పుడనేది తెలియకపోయినా..మరణించే ముందు మాత్రం కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తాయట. లక్షణాల్ని గుర్తు పట్టగలిగితే ఎప్పుడు మరణించేది స్పష్టమౌతుందంటారు. ఎవరైనా మనిషి మరణం సమీపంలో ఉంటే..ఆ వ్యక్తి కళ్లు, చర్మం, శ్రవణేంద్రియాల్లో మార్పు కచ్చితంగా కన్పిస్తుంది. వ్యక్తి మరణం ఎప్పుడనేది ఆ లక్షణాల్ని పసిగట్టడం ద్వారా అంచనా వేయవచ్చంటున్నారు.
మరణం సమీపిస్తున్న వ్యక్తి తరచూ పదే పదే తన కళ్లను మూస్తుంటాడట. చాలాసార్లు ఆ కళ్లు సగమే తెర్చుకుంటాయి. ముఖం కండరాలు చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. శ్వాస తీరు కూడా మారుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఓ రకమైన సౌండ్ వస్తుంది. మరణించేముందు ఆ వ్యక్తి చర్మం పసుపుగా మారుతుంటుంది.
మరణించేముందు శ్వాస తీసుకోవడం తగ్గిపోతుంది. ఆగి ఆగి శ్వాస తీసుకున్నట్టుగా ఉంటుంది. అంటే కాస్సేపు శ్వాస తీసుకోవడం..కొన్ని సెకన్లు ఆగిపోవడంం ఇలా జరుగుతుంటుంది. శ్వాస పీల్చడానికి వదలడానికి మధ్య గ్యాప్ ఉంటుంది. అందుకే దేహాన్ని త్యజించాడా అన్పిస్తుంటుంది. చివరి సమయంలో నిమిషంలో 2-3 సార్లే శ్వాస తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
ఇంకొంతమంది చివరి సమయంలో ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతుంటారు. కొంతమంది కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడాలనుకుంటారు. కొంతమంది ఉదాసీనంగా గడుపుతుంటారు. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఎలా అన్పిస్తుందో అంచనా వేయడం కష్టమౌతుంది. మరణ సమయంలో వ్యక్తి ఆందోళన పెరుగుతుంది. అదే విధంగా వ్యక్తిని బట్టి మరణ అనుభవం మారుతుంటుంది.
Also read: Heart Attack Risk: జిమ్ వెళ్తున్నా గుండెపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఏం జాగ్రత్తలు పాటించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook