Rose water uses in Winter: మారుతున్న సీజన్‌లో కారణంగా చాలా రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో చలికాలం మొదలైంది. దీని వల్ల జుట్టు సంరక్షణ చాలా కష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఈ క్రమంలో స్ప్లిట్ హెయిర్ సమస్య మహిళల్లో తరచుగా కనిపిస్తున్నాయి. అయితే జుట్టుకు పూర్తి పోషకాహారం అందకపోవడం వల్లయ వెంట్రుకల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరు వ్యక్తులు జుట్టు రాలడాన్ని వదిలించుకోవడానికి మార్కెట్లో రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను వాడుతున్నారు. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్‌ను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వెంట్రుకలుకు ఎలా ఈ వాటర్‌ను వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజ్ వాటర్‌తో జుట్టు కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి రోజ్ వాటర్‌తో జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చర్మానికే కాకుండా జుట్టు సమస్యల కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజ్ వాటర్‌ను జుట్టుకు అప్లై చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా తొలగిపోతాయి.
2. చలికాలం రాగానే జుట్టులో చుండ్రు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. రోజ్ వాటర్ జుట్టులో పెరుగుతున్న చుండ్రును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా జుట్టు డ్యామేజ్‌ను నివారిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
3. రోజ్ వాటర్ జుట్టు సమస్యలను దూరం చేయడమేకాకుండా జుట్టును బలంగా చేసేందుకు సహాయపడుతుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రోజ్ వాటర్‌ని వినియోగించాలి.
4. రోజ్ వాటర్ వాడాలంటే ముందుగా 1 కప్పు పెరుగులో 5 టీస్పూన్ల రోజ్ వాటర్, 1 టీస్పూన్ నిమ్మరసం, 2 టీస్పూన్ల మెంతిపొడి కలిపి పేస్ట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టుకు అప్లై చేయాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి