Reduce Gastric Problem: కేవలం ఒకే రోజులో గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టే 5 అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే..

Gastric Problem Home Remedies: తరచుగా పొట్టలోని గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఔషధాలకు బదులుగా ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో తయారు చేసిన హోమ్ రెమెడీస్‌ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ హోమ్ రెమెడీస్ ను వినియోగించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం పొందవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 14, 2024, 09:11 PM IST
Reduce Gastric Problem: కేవలం ఒకే రోజులో గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టే 5 అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఇవే..

 

Gastric Problem Home Remedies: ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం కారణంగా పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. రోడ్లపై లభించే స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం కారణంగానే గ్యాస్ కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు కొంతమందిలో జీర్ణక్రియను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పుట్ట సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు చాలా మంది తరచుగా మార్కెట్లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగిస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని బాధపడుతున్నారు. అయితే ఈ గ్యాస్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగించకుండా.. ఇంటి చిట్కాలతో తగ్గే కొన్ని రెమెడీస్‌ని మీకు పరిచయం చేయబోతున్నాం. 

పొట్టలో గ్యాస్‌ తగ్గడానికి 10 హోమ్‌ రెమెడీస్‌:
1. అల్లం:

అల్లంలు అద్భుతమైన ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ అల్లం ముక్కలు వేసి మరిగించి, వడగట్టి తాగండి. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

2. జీలకర్ర:
జీలకర్ర కూడా పొట్టలోని గ్యాస్ తగ్గించడానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజు జీలకర్రను తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక టీస్పూన్ జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి, వడగట్టి తాగండి.

3. పుదీనా:
పుదీనా యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి కడుపునొప్పి కడుపులో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పుదీనాతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల గొప్ప ఉపశమనాన్ని పొందుతారు. అంతేకాకుండా పుదీనా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు పొట్టను చల్లగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా తరచుగా పుట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుదీనా రసాన్ని తాగాల్సి ఉంటుంది.

4. ఇంగువ:
ఇంగువ కూడా జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు ఇంగువను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలు పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంగువను ఆహారంలో వినియోగించడం ఎంతో మంచిది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

5. కలబంద:
జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కలబంద కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కలబంద గుజ్జును ప్రతిరోజు రెండు టీ స్పూన్ల పాటు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News