పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే అని అందుకే అన్నారు పెద్దలు. ఆ చేప ఖరీదు అంత ఉంటుంది. అంత విలువైంది.. రుచికరమైంది కూడా. అంతర్వేది సమీపంలో ఆ పులస చేప ఎంత ఖరీదు పలికిందో తెలుసా మరి
పులస చేప ( Pulasa fish ) కొనుగోలు చేసే బదులు బంగారం ఎంతో కొంత కొనవచ్చని పెద్దలంటుంటారు. దీన్నే ఇంకో విధంగా పుస్తెలమ్మైనా సరే పులస తినాల్సిందే అంటారు. దీనికి కారణం పులస చేపకున్న రుచి. డిమాండ్. సముద్రంలో పుట్టిన ఇలస ( Hilsa fish )...గోదావరి నదిలో కలిసి పులసగా మారుతుంది.
నీటికి ఎదురీదే లక్షణమున్న ఏకైక చేప ఇది. అందుకే సముద్రంలో పుట్టి...నదిలోకి ప్రవేశిస్తుంది. గోదావరి నది ( River Godavari ) లో ప్రవేశించాక ఎంతదూరం ప్రయాణిస్తే చేప అంత రుచిగా మారుతుంది. గోదావరి వరదొచ్చాక తగ్గే సమయంలో అంటే...ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లోనే ఈ చేప లభిస్తుంది. అంటే ఏడాదికోసారి లభించే అరుదైన రుచికరమైన చేప అన్నమాట.
ఇంత రుచికరమైంది కాబట్టే డిమాండ్ ఎక్కువ. ఇటీవలి కాలంలో పెద్దగా పులస చేప చిక్కడం లేదు మత్స్యకారులకు. అందుకే ఖరీదు మరింతగా పెరిగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలో ఉన్న చించినాడ వంతెన వద్ద మత్స్యకారుడికి రెండు కేజీల బరువున్న రెండు పులస చేపలు చిక్కాయి. ఈ రెండు చేపల ఖరీదు ఎంతో తెలుసా. అక్షరాలా 31 వేలు. పులసపై మక్కువతో ఓ మాజీ సర్పంచ్ 31 వేలు పెట్టి కొనుగోలు చేసాడు మరి.
బెండకాయతో కలిపి పులుసు వండితే ఆ రుచిని ఇక మాటల్లో వర్ణించలేం. నాలుక ఆస్వాదనను మర్చిపోలేం. సహజంగా వండిన రెండోరోజు లేదా మూడోరోజు పులస పులుసు రుచి మరింతగా పెరుగుతుంది. అందుకే గతంలో బ్రిటీష్ దొర కాటన్ కు..అప్పట్లో అన్నదాతలు పులస పులుసు వండి మద్రాస్ కు తీసుకెళ్లేవారు. పాడవకుండా..మరింత రుచికరంగా మారి ఉండేదట. Also read: Skin Care: ఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు