Potato Side Effect: అతిగా బంగాళాదుంపలను వినియోగిస్తే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..

Potato Side Effect: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బంగాళాదుంప తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 02:15 PM IST
Potato Side Effect: అతిగా బంగాళాదుంపలను వినియోగిస్తే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..

Potato Side Effect: భారత దేశంలో బంగాళాదుంపను కూరగాయలకు రారాజు పిలుస్తారు. ఎందుకంటే ఈ దుంపను అన్ని శుభ కార్యయాల్లో విందులో వడ్డిస్తారు. అంతేకాకుండా అందరికీ ఎంతో ఇష్టమైన  సమోసాలు, బ్రెడ్ పకోడాల్లో వంటి ఫుడ్‌లలో కూడా వినియోగిస్తారు. అయితే దీనిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చు:
అలర్జీ:

బంగాళాదుంపను అతిగా తినడం వల్ల శరీరానికి పిండి పదార్ధం అధిక మోతాదులో లభించి అలర్జ వంటి తీవ్ర సమస్యలకు దారీ తియోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే అలెర్జీ సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గౌట్:
బంగాళాదుంప రుచి పరంగా బాగున్నప్పటికీ చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి  ఆర్థరైటిస్ నొప్పుల కారణం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం:
మధుమేహంతో బాధపడుతున్నవారికి బంగాళదుంపలను అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణుల తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం:
బరువు పెరగడం ప్రస్తుతం సాధరణ సమస్యగా మారిపోయింది. అయితే శరీర బరువు సులభంగా పెరిగే వారు బంగాళాదుంపలను ఎక్కువగా తినకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా వీటిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అధిక బీపీ:
అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు బంగాళాదుంపలను తినొద్దని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారీ తిసే ఛాస్స్‌ ఉంది.

Also Read: Planadu Gun Firing: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. టీడీపీ మండలాధ్యక్షుడికి బుల్లెట్ గాయాలు! పరిస్థితి విషమం

Also Read: Hyderabad: హైదరాబాద్​లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News