Pomegranate Juice Health Benefits: పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని వైద్యులు ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా పండ్లను తినమని సూచిస్తారు. నిజానికి శరీరానికి ఒక్కొక్క పండు ఒక్కొక్క రకంగా సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి తక్షణమైన శక్తిని అందిస్తే.. యాపిల్ గుండె, జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఒక్కొక్క పండుకో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే దానిమ్మ పండుకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పండు గింజల నుంచి తీసిన రసాన్ని తాగితే అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులకు విరుగుడుగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఖాళీ కడుపుతో దానిమ్మ రసాన్ని తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఉదయాన్నే దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణవ్యవస్థకు మేలు..:
రోజు ఉదయాన్నే దానిమ్మ నుంచి తీసిన రసాన్ని తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది. దీనికి కారణంగా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే గుణాలు పొట్టను హాయిగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
హృదయ రోగాలకు చెక్..:
దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దానిమ్మ రసాన్ని ఉదయాన్నే తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. దీంతో పాటు బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుంది.
క్యాన్సర్ కణాలకు చెక్..:
దానిమ్మరసంలో ఉండే యాంటీ క్యాన్సర్ మూలకాలు క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వారు రోజూ ఉదయాన్నే దానిమ్మ రసాన్ని తాగడం వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇతర క్యాన్సర్లను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
శక్తిని పెంచుతుంది:
దానిమ్మ రసంలో విటమిన్ సి అధికమవుతాదిలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో సహజ చెక్కర కూడా ఉంటుంది. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ రసం తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అంతేకాకుండా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలకపాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెదడు కణాల మెరుగుదల కోసం..:
దానిమ్మ రసంలో ఉండే కొన్ని మూలకాలు మెదడు కణాలను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు రోజు ఉదయాన్నే దానిమ్మరసం తాగడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ రసంలో ఉండే కొన్ని మూలకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.