Pomegranate Benefits: వయసు పెరిగే చాలా మంది శరీరాల్లో మార్పలు సంభవిస్తాయి. ముఖ్యంగా స్త్రీలలోనైతే 40 ఏళ్లు దాటిక ముందే ఇలాంటి మార్పలు చూడొచ్చు. అయితే ఇలా మార్పులు రావడం సర్వసాధరణమైనప్పటికీ చాలా మందిలో శరీరం రక్తం లేకపోవడం, చర్మ సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో తప్పకుండా దానిమ్మపండును తీసుకోవాల్సి ఉంటుంది.
దానిమ్మలో లభించే పోషకాలు ఇవే:
దానిమ్మలో పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దానిమ్మ గింజల్లో శరీరానికి మేలు చేసే పాలీఫెనాల్స్ ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మహిళలకు దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. జుట్టు సమస్యలకు చెక్:
దానిమ్మ పండును ప్రతి రోజూ తినడం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావితం చేస్తుంది. ఈ పండును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జుటు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
2. హెల్తీ స్కిన్:
వయసు పెరగడం వల్ల చాలా మందిలో హెల్తీ స్కిన్ శాతం తగ్గుతుంది. అంతేకాకుండా ముఖం మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తప్పకుండా దానిమ్మ ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
3. కండరాల పునరుద్ధరణ:
వృద్ధాప్యంలో దశలో కండరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా దానిమ్మపండు ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కండరాలు నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి